ఏనుగులకు అంతపెద్ద చెవులు ఉండటానికి కారణం ఏమిటో తెలుసా..?!

ఏనుగులు ఎక్కువగా అరణ్యాల్లో ఉంటాయి.వాటిని దగ్గర నుంచి చూడాలంటే చాలమందికి వణుకు.

దూరం నుంచి చూడటానికి చిన్నపిల్లలు, పెద్దలు ఇష్టపడుతుంటారు.కొన్ని ఏనుగులు ఎంతసన్నిహితంగా మనతో ఉంటాయో మనకు తెలుసు.

కానీ అవి అంతే ప్రమాదకరం కూడా.వాటిని కోపం వస్తే ఇంకా అంతే సంగతులు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏనుగుల వల్ల మరణించన వారు ఉన్నారు.ప్రధానంగా వీటి ప్రభావం ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉంది.

Advertisement

ఏనుగులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.ఏనుగుకి సంబంధించి వాటి చెవులు, వాటి ఆకారం మాదిరిగానే చాలా పెద్దగా ఉంటాయి.

అవి ఎందుకు ఉపయోగమో ఇప్పుడు మనం తెలుసుకుందామా.ఏనుగుకు మన మాదిరి స్వేద గ్రంధులు ఉండవు.

కాస్త నల్లగా ఉన్న ఈ జీవికి శరీరంలో వేడి సహజంగానే బయటకు వస్తుంది.దానికి తోడు ఏనుగు క్షీరదము.

దానికి మన మాదిరి వేడి రక్తం ఉంటుంది.అందుకే అవి వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువగా నీళ్ళ దగ్గరే ఉంటాయి.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

అందుకే గజ ఈత అనే పేరు అందుకే వచ్చింది.ఏనుగు నీళ్ళల్లో బాగా ఈత కొట్టడం మనం చూస్తూనే ఉంటాం.

Advertisement

దానికి అన్ని వేళల్లో నీళ్లు దొరకవు కనుక బురద, తడి మట్టి మీద జల్లుకోవడం వంటివి చేస్తూ ఉంటాయి.దీనికి తోడు పంది, గేదే కూడా అందుకే ఎక్కువ బురదలో ఉంటాయి.

ఏనుగు చెవుల విషయానికి వస్తే, అవి చాటల మాదిరి చాలా వెడల్పుగా తక్కువ దళసరిగా ఉండటం మనం గమనించి ఉంటాం.అవి ఊపి గాలి వీచే విధంగా చేసుకుంటాయి.

ఆ చెవులలో రక్త నాళాలు ఎక్కువగా ఉంటాయి.రక్తం అక్కడికి చేరి చల్లారుతుంది.

దీని కారణంగా ఏనుగులకు చెవులు ఎక్కువ వెడల్పుతో ఉంటాయి.

తాజా వార్తలు