ఇంటి ద్వారం పై శుభం -లాభం అని రాయడానికి గల కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా సర్వసాధారణంగా మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి ఫోటోని ఉంచి ఇరువైపులా శుభం లాభం అని రాసి ఉంటాము.

ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం పై శుభం లాభం అని రాయడం వెనుక ఎలాంటి కారణం ఉంది అనే విషయానికి వస్తే.

మనం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు లేదా ఏదైనా మంచి పనులు చేసే ముందు ముందుగా పురోహితులు స్వస్తిక్ గుర్తు వేసి శుభం లాభం అని రాస్తారు.స్వస్తిక్ గుర్తు శుభానికి సంకేతం అనే విషయం మనకు తెలిసిందే.

ఈ సాంప్రదాయం గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది.ఇక ఇంటి ప్రధాన ద్వారం పై స్వస్తిక్ గుర్తు వేసి శుభం లాభం అని రాయటం వల్ల ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు.

ఇక విగ్నేశ్వరుడు ఎల్లవేళలా తమకు శుభం కలిగిస్తారని ఆ ఇంటికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లదని విశ్వసిస్తారు.ఇక ఆ ఇంటి ప్రధాన ద్వారం పై స్వస్తిక్ గుర్తుతో పాటు శుభం లాభం అని రాసి ఉండడం వల్ల ఆ ఇంటిపై సానుకూల శక్తి ఉంటుంది.

Advertisement

అందువల్ల మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ముందు శుభం లాభం అని రాయడం కూడా రాస్తారు.

ఇంటి ప్రధాన ద్వారం పై అమ్మవారికి సమర్పించే కుంకుమ ద్వారా స్వస్తిక్ గుర్తు వేసి శుభం అని రాయటం వల్ల ఆ ఇంటి పై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.అదేవిధంగా లాభం అని రాయటం వల్ల ఆదాయం లేదా సంపద ఎప్పుడూ పెరగాలని భగవంతుడిని ప్రార్థించడం మేడనని అర్థం.ఇంటికి ఏ విధమైనటువంటి చెడు ప్రభావం లేకుండా సిరి సంపదలతో మెలగాలంటే ఈ స్వస్తిక్ గుర్తు వేసుకోవటం వల్ల అంతా శుభం కలుగుతుందని చెప్పవచ్చు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు