మరో మూడు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ,ప్రత్యర్థులపై పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో వైసిపి దానికి తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తోంది.టీడీపీ, జనసేన( TDP, Jana Sena) కూటమిని అధికారంలోకి రాకుండా చేసి ,అతి తక్కువ స్థానాలకే పరిమితం చేసే విధంగా పావులు కదుపుతోంది.
వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ, అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు అని ధీమాను మొదటి నుంచి జగన్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.దీనికి అనుగుణంగానే ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసి దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఇక టిడిపి, జనసేన నుంచి కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది వైసీపీ.

ముఖ్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) > మంగళగిరి నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తుండడంతో, అక్కడ లోకేష్ ఓటమి కోసం వైసిపి భారీగానే వ్యూహాలు రచిస్తోంది.ఇక్కడ లోకేష్ పై చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య( Murugudu Lavanya )లను అభ్యర్థిగా దింపారు.ఈ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది.
ఇక ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భారీగానే సొమ్ములు ఖర్చు పెట్టేందుకు, ఓటర్లకు పంచేందుకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి .

వైసిపి 4000 , టిడిపి 3000 ఓటర్లకు పంచుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.దీనిపై తాజాగా నారా లోకేష్ స్పందించారు.మనం బాగా పనిచేస్తే భారీ మెజారిటీతో గెలుస్తామని , డబ్బులు పంచాల్సిన అవసరం లేదని , వైసిపి అభ్యర్థి తరఫున 4000 పంచుతున్నారని, అవసరమైతే మరో రెండు వేలు పెంచి పంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని, తమకు ఆ అవసరం లేదని, కచ్చితంగా ఇక్కడ తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్.