అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 'బ్రో ది అవతార్' ఎంత వసూలు చేసిందో తెలుసా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బ్రో ది అవతార్( Bro the Avatar ) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి.

చివరిగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న గ్రాండ్ గా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాట్లాడిన మాటలు అభిమానుల్లో మంచి జోష్ ని నింపింది.

అప్పటి వరకు సరైన హైప్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ ఈవెంట్ ఇచ్చిన జోష్ మామూలుది కాదు.ఈ ఈవెంట్ పూర్తైన వెంటనే ఈ సినిమాకి సంబంధించిన నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.

అర్థరాత్రి సమయం లో బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ కూడా టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందని అభిమానులు కూడా అంచనా వేయలేకపోయారు.

Do You Know How Much bro The Avatar Has Collected So Far Through Advance Booki
Advertisement
Do You Know How Much 'Bro The Avatar' Has Collected So Far Through Advance Booki

ప్రస్తుతం హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ పాన్ వరల్డ్ సినిమా రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.గంటకి 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని, బుక్ మై షో యాప్ లో అప్డేట్ కనిపిస్తుంది.ఇది మామూలు రేంజ్ ట్రేండింగ్ కాదనే చెప్పాలి.

అర్థ రాత్రి నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ కి తగ్గ బుకింగ్స్ జరిగాయట.పాన్ వరల్డ్ సినిమాలు రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక సాధారణమైన రీమేక్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ మాస్ చూపిస్తున్నాడు అంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా అమెరికా లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 5 లక్షల డాలర్లు ప్రీమియర్స్ నుండి వచ్చాయట.ప్రీమియర్స్ ముగిసే సమయానికి కచ్చితంగా 1 మిలియన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Do You Know How Much bro The Avatar Has Collected So Far Through Advance Booki

1 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం 8 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట, అలా కేవలం హైదరాబాద్ మరియు అమెరికా( America ) నుండి ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇక కర్ణాటక ప్రాంతం లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుంది.ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన బుకింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

అలా మొత్తం మీద ఈ చిత్రానికి ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సినిమా కచ్చితంగా మొదటి రోజు 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాదిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు , చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు