కరివేపాకు నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

కరివేపాకును చాలా వరకు మనం వంటకాలలో, తిర్వాతలలో ఎక్కువగా వాడుతాము.కరివేపాకులోని సువాసన అందరికీ చాలా ఆకర్షిస్తుంది.

ఇక సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ లాంటి వంటకాలలో కరివేపాకుని ఎక్కువగా ఉపయోగిస్తారు.కరివేపాకులో చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

అలాగే ఆంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన కూడా ఆయుర్వేద నిధిగా కరివేపాకు పరిగణించబడుతుంది.ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కరివేపాకు మాత్రమే కాకుండా కరివేపాకు నుండి వచ్చే నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement

కరివేపాకు నీరు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.కరివేపాకు అనేక రకాలుగా మనం తీసుకుంటూ ఉంటాం.అయితే కరివేపాకు నీరు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు నీరు తయారు చేసుకోవడం చాలా సులువు.ఒక పాన్ లో ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి.

ఆ తర్వాత ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి.ఆ నీరు రంగు మారేవరకు బాగా మరిగించాలి.

ఆ తర్వాత కరివేపాకు ఆకులను తీసేయాలి.ఇక ఆ నీటిని తాగాలి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఈ నీటిని తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ నీటిని తాగడం వలన బరువు తగ్గవచ్చు.

Advertisement

ఇక ఊబకాయం( Obesity )తో బాధపడుతున్నవారు, కొలెస్ట్రాల్( Cholesterol) తో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.ఇక జీర్ణక్రియ( Digestion ) సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కరివేపాకు నీటిని తీసుకోవడం మంచిది.దీని వలన గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు దూరం అవుతాయి.

కరివేపాకు నీటిని తీసుకోవడం వలన విష మలినాలు కూడా తొలగిపోతాయి.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీర నిర్వీకరణకు సహాయపడతాయి.

ఇక చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు లాంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తాజా వార్తలు