మీకు తెలుసా : యాపిల్‌ తినేప్పుడు కాస్త జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదమట

ప్రతి రోజు ఒక యాపిల్‌ తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం.

యాపిల్‌ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌ కూడా పెరుగుతుంది.

అందుకే అనారోగ్యంతో ఉన్న వారు ఎక్కువగా యాపిల్స్‌ తినాలని పెద్దలతో పాటు డాక్టర్స్‌ కూడా అంటూ ఉంటారు.అందుకే పిల్లల నుండి పెద్దల వరకు అంతా కూడా యాపిల్స్‌ను ఇష్టంగా లేదంటే కష్టంగా అయినా తింటారు.

యాపిల్స్‌కు ఎక్కువ రేటు ఉన్నా కూడా దాదాపుగా అంతా తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Do You Know Apple Seeds Are For Health

యాపిల్స్‌ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కాని యాపిల్స్‌ను తినే సమయంలో కాస్త జాగ్రత్తగా లేకుంటే మాత్రం ప్రమాదం అంటూ డాక్టర్లు అంటున్నారు.ఇంతకు యాప్సిల్స్‌ ప్రమాదం ఏంటా అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటీ అంటే యాప్సిల్స్‌లో ఉండే విత్తనాలు విషతుల్యంగా ఉంటాయని అంటున్నారు.

Advertisement
Do You Know Apple Seeds Are For Health-మీకు తెలుసా : యా

యాపిల్స్‌లో ఉండే విత్తనాలను ఒకటి రెండు తింటే పర్వాలేదు కాని ఎక్కువగా తింటే మాత్రం చనిపోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Do You Know Apple Seeds Are For Health

ఒక సర్వే ప్రకారం 60 కేజీల బరువు ఉండే 40 ఏళ్ల వ్యక్తి 150 నుండి 175 యాపిల్‌ విత్తనాలు తినడం వల్ల చనిపోతారట.అదే 10 ఏళ్ల లోపు పిల్లలు కనీసం 50 తిన్నా కూడా చనిపోతారని వైధ్యులు అంటున్నారు.అందుకే పిల్లలకు యాపిల్స్‌ తినిపించాలి అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ వైధ్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు యాపిల్స్‌ ఇచ్చిన సమయంలో అందులో విత్తనాలు లేకుండా చేయాల్సి ఉంటుంది.ఏం కాదులే అనుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వైధ్యులు హెచ్చరిస్తున్నారు.

మరి మీరు పిల్లలకు యాపిల్స్‌ ఇస్తున్నట్లయితే ఇది మీకోసమే.

దొడ్డి దారిన విదేశాలకు .. 3,225 మంది ట్రావెల్ ఏజెంట్లపై పంజాబ్ సర్కార్ కేసులు
Advertisement

తాజా వార్తలు