పదేపదే నన్ను అదే అడగొద్దు ! ఆ విషయాలపై ఈటల క్లారిటీ 

హుజురాబాద్ బిజెపి ( BJP )ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నారని , పార్టీలో తన స్థాయికి తగ్గట్టుగా ప్రాధాన్యం దక్కడం లేదని , తన ప్రభావం పెరగకుండా పార్టీలో కొంతమంది కీలక నాయకులు రాజకీయాలు చేస్తున్నారనే కారణంతో ఈటెల రాజేందర్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది.

బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలతో అసంతృప్తి గురైన రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత ఆయనకు చేరికలు కమిటీ చైర్మన్ గా బిజెపి అధిష్టానం అవకాశం కల్పించింది.

అయితే పెద్దగా చేరికలు చోటు చేసుకోకపోవడం, రాజేందర్ చేరిన చేరిన దగ్గర నుంచి తెలంగాణ బిజెపిలో గ్రూపులు పెరిగిపోవడం వంటి కారణంతో బిజెపి అధిష్టానం ఆయనపై అసంతృప్తితో ఉందనే వార్తలతో రాజేందర్ కలత చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంపై తాజాగా రాజేందర్ స్పందించారు.పార్టీ మార్పు పై పదే పదే తన లాంటి వాడిని ప్రశ్నించొద్దని రాజేందర్ అన్నారు.

పార్టీలు మార్చడం అంటే బట్టలు మార్చిన అంత ఈజీ కాదని, అదే నిజమని కాంగ్రెస్ అనుకుంటే పొరపాటునని ఈటల అన్నారు. కేసీఆర్( KCR ) మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనని, తెలంగాణలో తెచ్చుకుంది అభివృద్ధి కోసం మాత్రమే కాదని , ఆత్మగౌరవం కోసం కూడా అంటూ రాజేందర్ పేర్కొన్నారు.

Advertisement

కేసీఆర్ అన్ని పార్టీలలో తన కోవర్ట్ లను పెట్టుకున్నారని ఆరోపించారు.ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఈటెల కేంద్ర హోం మంత్రి అమిత్  భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాజేందర్ కు తెలంగాణ బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ పదవి పై బిజెపి పెద్దల నుంచి హామీ లభిస్తుందని ఆయన భావించినా,  బీజేపీ అధిష్టానం ఆయనకు  ఏ హామీ ఇవ్వకపోవడంతో, ఆయన అసంతృప్తి కి గురయ్యారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో తాజాగా ఈ విధంగా రాజేందర్ స్పందించారు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు