నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగార్జున( Nagarjuna ) లాంటి హీరో ఇప్పుడు సోలో సినిమాలు చేయకుండా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.

దానికి గల కారణం ఏంటి ఎందుకు ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ చాలా మంది అతని అభిమానులైతే నిరాశ చెందుతున్నారు.ఇప్పటికే ఆయన రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ సినిమాలో( Coolie Movie ) విలన్ గా నటిస్తున్నాడనే వార్తలైతే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అలాగే ధనుష్ కుబేర ( Kubera ) మూవీ లో కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు.

Do Fans Want Nagarjuna To Focus On His 100th Film Details, Nagarjuna, Akkineni N

కాబట్టి ఆయన అలాంటి క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరం ఏముంది.తన తోటి హీరోలు మంచి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు కదా.మరి ఆయన కూడా అలాంటి సినిమాలు చేస్తే అయిపోయేది కదా అంటూ అక్కినేని అభిమానులు మాత్రం చాలా వరకు దిగ్భ్రాంతి గురవుతున్నారనే చెప్పాలి.ఎందుకంటే నాగార్జున కొడుకులు కూడా పెద్దగా సినిమాలతో సక్సెస్ లను సాధించడం లేదు.

Do Fans Want Nagarjuna To Focus On His 100th Film Details, Nagarjuna, Akkineni N
Advertisement
Do Fans Want Nagarjuna To Focus On His 100th Film Details, Nagarjuna, Akkineni N

మరి నాగార్జున అయినా అడపాదడపా సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటాడు అనుకుంటే ఆయన కూడా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుండటం వాళ్లకు ఏమాత్రం నచ్చడం లేదంటూ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధించిన కూడా ఆయన అభిమానులు మాత్రం అంత సాటిస్ఫై అయ్యే విధంగా కనిపించడం లేదు.కాబట్టి ఆయన తను హీరోగా తన వందో సినిమాని ఏ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుందో ముందు అది నిర్ణయించుకుంటే మంచిదని కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏం మాయ చేసావే ఎప్పటికీ ప్రత్యేకమే... మొదటి సినిమాని గుర్తు చేసుకున్న సమంత!
Advertisement

తాజా వార్తలు