ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పిల్లలకు క్రీడా సామాగ్రి పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన చిన్నారులకు అబ్బాయిలకు క్రికెట్ కిట్, అమ్మాయిలకు వాలీబాల్ కిట్లను ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పర్శ హన్మాండ్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని చదువుకునే రోజుల్లో క్రికెట్( Cricket ) అంటే అమితం గా ఇష్టపడే వాడినని పిల్లలను క్రీడలలో ప్రోత్సహించేందుకే ఈ క్రీడాసామాగ్రిని పంపిణీ చేసినట్లు పర్శ హన్మాండ్లు తెలిపారు.

పిల్లలు చదువుతోపాటు ఆటపాటలతో రాణించాలన్నారు.

శారీరక వృద్ధికి ,మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.పోటీ తత్వాన్ని స్నేహ భావాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో తోడ్పాటును అందిస్తాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) రాష్ట్రంలోక్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు.ఇక్కడ యూత్ నాయకులు మహేష్, భరత్ ,రాజేష్ తదితరులు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News