కేఏ పాల్ అమిత్ షా మధ్య చర్చ ! పవన్ వెంట పడుతున్నారా ?

కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మత ప్రబోధకుడు గా ఉన్న ఆయన ఆ తర్వాత క్రమంలో రాజకీయ నాయకుడిగా మారారు.

ఏపీ లో 2019 లో జరిగిన ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున ఆయన ఆయన, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినా.ఘోర పరాజయం ఎదురైంది.

అప్పటి నుంచి  రాజకీయ అంశాలపై అనేక సందర్భాల్లో స్పందిస్తూ.తనదైన శైలిలో రాజకీయ పార్టీల పైన,  నాయకులు పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే ఇటీవల టిఆర్ఎస్  చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసేందుకు కొద్ది రోజుల క్రితం కేఏపాల్ ఆయనతో భేటీ అయ్యారు.

Advertisement
Discussion Between Ka Paul And Amit Sha On Janasena Party Details, Ka Pal, Jana

ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా ప్రకటించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ పై తమ మధ్య చర్చ జరిగినట్లుగా పాల్ ప్రకటించారు.

ఏపీలో రెండు శాతం ఓట్లు లేని పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్ షా ను పాల్ ప్రశ్నించగా.తాము పవన్ కళ్యాణ్ వెనుక పడడం లేదని , ఆయనే తమ వెనుక పడుతున్నాడని అమిత్ షా చెప్పినట్లుగా ప్రకటించారు.

దీనిపై కేఏపాల్ తనదైన శైలిలో స్పందిస్తూ.జనసేన పై విమర్శలు చేశారు.

వాస్తవంగా అమిత్ షా కేఏపాల్ మధ్య జనసేన అంశం చర్చకు వచ్చిందా లేదా అనే దాంట్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ,  పాల్ చెప్పిందే నిజమయితే .అమిత్ షా మాత్రం జనసేన వెంట తాము పడడం లేదని,  ఆయన తమ వెంట పడుతున్నాడనే విషయం నిజంగా చెప్పి ఉంటే ఏపీలో జనసేన బీజేపీ బంధం కు బీటలు వారి నట్లే. 

Discussion Between Ka Paul And Amit Sha On Janasena Party Details, Ka Pal, Jana
ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
రాజేంద్రప్రసాద్ తీరుపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.... హాస్యం, అపహాస్యానికి తేడా తెలీదా అంటూ! 

ఇప్పటికే బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న క్రమంలోనే కె ఏ పాల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.పవన్ డిల్లీకి వచ్చిన ప్రతిసారి కేంద్ర మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి వారితో భేటీ ఉన్నారు తప్ప,  ఎన్నికల అనంతరం బీజేపీ తో జనసేన పొత్తు కుదిరిన దగ్గర నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇప్పుడు అమిత్ షా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతుండడం వంటివి రాజకీయంగా  చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు