స్టార్ హీరో బాలయ్య గొప్పదనం ఇదే.. ప్రముఖ దర్శకుడి కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో బాలకృష్ణ వి.వి వినాయక్ కాంబినేషన్ లో చెన్నకేశవరెడ్డి సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.

బాలయ్య అభిమానులకు ఈ సినిమా నచ్చినా స్క్రీన్ ప్లే లోపాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి.బాలయ్య బాబును మొదట ఇంటికి వెళ్లి కలిసిన సమయంలో ఆయనను చూసి ఈయనకు మేకప్ ఎందుకు అని అనిపించిందని వినాయక్ చెప్పుకొచ్చారు.

ఒక దర్శకునికి, నిర్మాతకు బాలయ్య ఎంతో గౌరవం ఇస్తారని వినాయక్ తెలిపారు.బాలకృష్ణ ఒక సందర్భంలో కూడా ఏమిటి? ఎందుకు? అని అడిగిన సందర్భం లేదని వినాయక్ తెలిపారు.బాలయ్య బాబు ఏదైనా చెప్పడానికి దగ్గరికి వెళితే వెంటనే నిలబడతారని వినాయక్ చెప్పుకొచ్చారు.

ఆయన ఇచ్చే గౌరవం వండర్ ఫుల్ అని వినాయక్ కామెంట్లు చేశారు.అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య అంటే ఏంటో అందరికీ తెలిసిందని వినాయక్ చెప్పుకొచ్చారు.

Advertisement

ఎండ అంటే బాలయ్యకు చాలా ఇష్టమని వినాయక్ తెలిపారు.చెన్నకేశవరెడ్డి సినిమాలో హెలికాఫ్టర్ సీక్వెన్స్ లో రోప్ సహాయం కూడా లేకుండా బాలయ్య చేశారని వినాయక్ చెప్పుకొచ్చారు.

ఆ షాట్ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డానని వినాయక్ తెలిపారు.

సినిమాలో భార్య చనిపోయిన సమయంలో బాలయ్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ఊహించని రేంజ్ లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.చెన్నకేశవరెడ్డి కథ చెప్పిన వెంటనే బాలయ్యకు నచ్చి ఓకే చెప్పారని ఆయన తెలిపారు.చెన్నకేశవరెడ్డి సినిమాను పరుచూరి గోపాలకృష్ణ చూసి ఉంటే రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగ్ కొంచెం హడావిడిగా జరిగిందని ఆయన తెలిపారు.ఈ కారణం వల్లే సినిమా రిలీజైన తర్వాత సాంగ్ ను యాడ్ చేశానని వినాయక్ తెలిపారు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చే పదం అయిన శరభను నేను మణిశర్మకు చెప్పి పెట్టించానని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు