రెండు అద్భుతమైన సినిమాలు అతి చిన్న వయసులో కన్ను మూసిన దర్శకుడు

మరణం ఎవరిని ఎలా తీసుకెళ్లిపోతుందో ఎవరు ఊహించగలరు చెప్పండి.విధి ఆడే వింత నాటకంలో మనం కేవలం పాత్రదారులం మాత్రమే.

అందుకు ఆ విధి రాతను ఎదిరించి బ్రతక లేం.బోలెడు భవిష్యత్తు ఉన్న కొంత మంది అనతి కాలంలోనే ఈ లోకాన్ని వీడి వెళ్లడం సర్వత్రా మనం చూస్తూనే ఉన్నాం.ఇక సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం ఏమి కాదు.

చాల మంది చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిన వారు ఉన్నారు.అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన వ్యక్తి తిరుపతి సామి.

చెన్నై వాస్తవ్యుడైన తిరుపతి సామీ తెలుగు లో రెండు సినిమాలు చేసాడు.అది కూడా స్టార్ హీరోలు గా చలామణి అవుతున్న వెంకటేష్ మరియు నాగార్జున తో.

Advertisement
Director Thirupathi Saamy Tragedy Ending , Tirupati Samy, Director Thirupathi Sa

తీసిన రెండు సినిమాల్లో కూడా ఒక వైవిధ్యమైన కథలను ఎంచుకుని సమాజానికి ఉపయోగపడే ఒక మెస్సేజ్ ఇస్తూ తీయడం అంటే నిజంగా ఒక గట్స్ ఉన్న వ్యక్తి అని చెప్పుకోవాలి.తిరుపతి సామి 1998 లో హీరో వెంకటేష్ ని మొదట దర్శకత్వం వహించాడు.

ఆ చిత్రం పేరు గణేష్.ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న దారుణాలను ఎండగడుతూ తీసిన ఈ సినిమా మంచి డీసెంట్ హిట్ ని అందుకుంది.

Director Thirupathi Saamy Tragedy Ending , Tirupati Samy, Director Thirupathi Sa

ఆ తర్వాత నాగార్జున తో 2000 సంవత్సరంలో ఒక సినిమా తీసాడు.దాని పేరు ఆజాద్.ఈ చిత్రం కూడా విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.

ఈ రెండు సినిమాలు మాత్రమే తెలుగు లో చేసిన తిరుపతి తమిళ్ లో విజయ్ కాంత్ హీరో గా, ఇషా కొప్పికర్ హీరోయిన్ గా నరసింహ అనే చిత్రాన్ని తీసాడు.ఈ సినిమా నాగార్జున హీరో గా చేసిన ఆజాద్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

అయితే ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమం లో అయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడం తో అక్కడికి అక్కడే తిరుపతి సామి మృతి చెందాడు.ఎంతో భవిష్యత్తు ఉన్న తిరుపతి ఇలా అర్దాంతరంగా కన్ను మూయడం ఎంతో మందిని కలచి వేసింది.

Advertisement

తిరుపతి సామి బ్రతికి ఉంటె ఖచ్చితంగా ఒక్క గొప్ప దర్శకుడు అయ్యేవాడు.ఇలా విధి ఆడిన వింత నాటకంలో అయన ప్రయాణం ముగిసిపోయింది.

తాజా వార్తలు