డైరెక్షన్ కి కొత్త అర్థాన్ని చెబుతున్న దర్శకుడు సంతోష్ జగర్లపూడి... సినిమా కోసం ఏదైనా చేసేస్తాడా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సరికొత్త కథలతో కొత్త దర్శకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు.

ఇక మరి కొంతమంది దర్శకులైతే ఎలాగైనా సరే సక్సెస్ లను అందుకోవాలనే ఉద్దేశ్యంతో మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేసి సూపర్ సక్సెస్ లను అందుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే సుబ్రహ్మణ్య పురం ( Subrahmanya Puram )అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి( Director Santhosh Jagarlapudi ).ఇక ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి సుమంత్ ను హీరోగా పెట్టి మహేంద్రగిరి వారాహి( Mahendragiri Varahi) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని దర్శకుడు ముందుకు సాగుతున్నాడు.ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ చాలా మంచి పాజిటివ్ వైబ్ తో ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఇక దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కి ఈ షెడ్యూల్ కి మూడు రోజుల ముందుగా ఒక యాక్సిడెంట్ జరగడంతో ఆయన కాలుకి ఒక పెద్ద గాయం అయితే అయింది.అయినప్పటికీ ప్రొడ్యూసర్ గురించి, సినిమా గురించి ఆలోచించిన ఆయన సినిమా షూటింగ్ ఎక్కడ పోస్ట్ పోన్ చేయకుండా తన కాలికి ప్రమాదం జరిగిన కూడా దాన్ని పట్టించుకోకుండా షూటింగ్ స్పాట్ కి వెళ్లి వీల్ చైర్ లో కూర్చోని మరి సినిమాని డైరెక్ట్ చేశాడు.నిజానికి సినిమా కోసం ఏదైనా చేయగలం అని అందరూ చెబుతూ ఉంటారు.

Advertisement

కానీ ఇతన్ని చూస్తే మాత్రం సినిమా కోసం ప్రాణం కూడా ఇచ్చేసేంత ఫ్యాషనేట్ గా ఉన్నాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఇవాళ్ళ రేపు చాలా మంది దర్శకులు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సినిమా ఇప్పుడు చేస్తా, అప్పుడు చేస్తా అంటూ తప్పించుకు తిరుగుతున్న రోజుల్లో తన గురించి ఆలోచించకుండా సినిమా కోసం ప్రాణం పెట్టేసే సంతోష్ జాగర్లపూడి లాంటి డైరెక్టర్ దొరకడం నిజంగా ప్రొడ్యూసర్ అదృష్టం అనే చెప్పాలి.

ఇక తన గత చిత్రాలతో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న ఆయన ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవడమే పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.అందుకోసమే తను ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే సినిమాలనేవి అసలు ఫ్లాప్ అవ్వవు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటి వరకు జరిగిన షూట్ కూడా చాలా అద్భుతంగా వచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక బ్యాలెన్స్ పార్ట్ ను కూడా చాలా బాగా తెరకెక్కించి భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు