రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో (Kishan Das Peta)పెద్దమ్మల లక్ష్మీ, కొత్త బాలవ్వకి చెందిన ఇల్లు నిన్న రాత్రి కురిసిన వర్షాలకు కూలగా ఇట్టి విషయం తెలుసుకున్న స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకోగా ఆమె మాట్లాడుతూ తమ ఇల్లు లోపలి భాగం,వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది.రాత్రి పూట నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంట్లో మట్టి బెడ్డలు కూలగా ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పిల్లలు తెల్లవారే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు తెల్లరుతుందోననీ ఆందోళనకు గురయ్యమని పెద్దమ్మల లక్ష్మి స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు తెలిపారు.
ఇట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని మండల తహశీల్దార్ బి.రామచంద్రంను బాలరాజు యాదవ్ కోరారు.