మోహన్ బాబు కొడుకులకు ఆ అర్హత లేదు.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో సాగర్ ఒకరు కాగా సాగర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేను పదవులలో ఉన్న సమయంలో పరిచయం ఉన్నా లేకపోయినా మీరు నన్ను కోరింది నా వల్ల కాదంటే అప్పుడే చెప్పేస్తానని ఆయన అన్నారు.

అందరి విషయంలో నేను సమానంగా వ్యవహరించానని సాగర్ చెప్పుకొచ్చారు.కోడి రామకృష్ణ డ్రైవర్ నాతో డ్రైవర్స్ యూనియన్ లో తప్పులు జరుగుతున్నాయని చెప్పాడని సాగర్ అన్నారు.

పెద్దాయన దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్లి ఇన్ని ఫైల్స్ ఇచ్చానని వాళ్లు రోజూ నాతో సమస్యలు చెప్పేవారని దాసరి గారికి ఆ ఫైళ్లను చూసే సమయం కూడా ఉండేది కాదని సాగర్ అన్నారు.నేను వ్యక్తిగత ఆసక్తితో అక్కడ జరుగుతున్న మోసాలను బయటపెట్టానని ఆయన తెలిపారు.

వాళ్లపై చర్యల దిశగా అడుగులు వేయడంతో వాళ్లు నన్ను కలిసి చూసీ చూడనట్టు వెళ్లాలని కోరారని సాగర్ పేర్కొన్నారు.

Director Sagar Comments About Mohan Babu Sons Details Here Goes Viral , Mohan Ba
Advertisement
Director Sagar Comments About Mohan Babu Sons Details Here Goes Viral , Mohan Ba

ఆ సమయంలో తప్పు నాన్నా అది నా వల్ల కాదని వాళ్లతో చెప్పానని సాగర్ చెప్పుకొచ్చారు.తప్పు చేస్తే ఒప్పుకోవాల్సిందే అని ఆయన అన్నారు.మోహన్ బాబు గారు నాకు భక్తవత్సలం నాయుడుగా తెలుసని సాగర్ కామెంట్లు చేశారు.

నేను చిన్నప్పుడు పెద్ద రౌడీ అని ఆయనకు ఆ విషయం తెలుసని సాగర్ అన్నారు.మోహన్ బాబు ఇద్దరు కొడుకులవి మా మెంబర్ షిప్ చెక్కులు వచ్చాయని నేను వాటిని తీసెయ్యాలని చెప్పానని సాగర్ అన్నారు.

Director Sagar Comments About Mohan Babu Sons Details Here Goes Viral , Mohan Ba

నా కొడుకులకు మెంబర్ షిప్ ఇవ్వవా అని మోహన్ బాబు అడగగా నీ కొడుకులు సినిమాలు చేయకుండా మెంబర్ షిప్ ఎలా ఇస్తానని చెప్పానని ఆయన తెలిపారు.ఆ సమయానికి విష్ణు, మనోజ్ సినిమాలు చేయలేదని సాగర్ పేర్కొన్నారు.నేను చేర్చకపోయినా వేరే వాళ్లు అసోసియేషన్ లో పేర్లు చేర్చారని సాగర్ కామెంట్లు చేశారు.

అర్హత లేకపోతే మోహన్ బాబు కొడుకుల అప్లికేషన్స్ సైతం రిజెక్ట్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు, .

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు