ఆ ఫ్లాపులతో నాకు సంబంధం లేదు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి డైరెక్షన్ లో ఏ హీరో నటించినా ఆ హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సంగతి తెలిసిందే.

యాదృచ్ఛికంగా జరుగుతుందో లేక ఆయా హీరోల సినిమాలపై అంచనాలు పెరగడం వల్ల జరుగుతుందో తెలీదు కానీ రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరోలు సక్సెస్ సాధించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు.

బాలయ్య షోకు రాజమౌళి గెస్ట్ గా హాజరు కాగా రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని అభిమానులు అడిగారని బాలయ్య చెప్పుకొచ్చారు.బాలయ్యను హ్యాండిల్ చేయలేనని మీరు చెప్పారని తాను విన్నానని బాలయ్య చెప్పగా రాజమౌళి చిరునవ్వు నవ్వారు.

భయం వల్లే బాలయ్యతో సినిమా చేయడం లేదని రాజమౌళి పేర్కొన్నారు.బాలయ్య మాట్లాడుతూ బసవతారకం ఆస్పత్రికి రాజమౌళి కూడా అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

సామాన్యులకు కూడా వీఐపీలాగా బసవతారకం ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత బాలయ్య రాజమౌళిని మాయగాడు అని అన్నారు.

Advertisement

హీరోలకు కూడా వాట్సాప్ గ్రూప్ ఉందని బాలయ్య చెప్పగా డైరెక్టర్లకు ఇంకా స్ట్రాంగ్ వాట్సాప్ గ్రూప్ ఉందని రాజమౌళి అన్నారు.మనస్సులో అనుకున్న విధంగా ఫ్రేమ్ వచ్చే వరకు తాను కష్టపడతానని రాజమౌళి చెప్పుకొచ్చారు.బాలయ్య మాట్లాడుతూ తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని అన్నారు.

అయితే తనకు అవతార్ సినిమా నచ్చలేదని బాలయ్య అన్నారు.

రాజమౌళి తనకు మగధీర కథ చెప్పారని బాలయ్య సరదాగా చెప్పుకొచ్చారు.ఆ తర్వాత హీరోలకు రాజమౌళి ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని కానీ ఆ హీరోల తర్వాత సినిమాలు మాత్రం ఫసక్ అని బాలయ్య చెప్పగా ఆ ఫ్లాపులతో నాకు ఎటువంటి సంబంధం లేదని రాజమౌళి అన్నారు.దర్శకుడు మెరుపు అయితే సంగీత దర్శకుడు ఉరుము అని బాలయ్య కీరవాణిని ప్రశంసించారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు