పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం అసాధ్యం అంటూ డైరెక్టర్ బోయపాటి శ్రీను షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్( Tollywood ) లో పవర్ స్టార్ కి ఉన్నటువంటి స్టార్ డమ్ ఎలాంటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన తన మొదటి సినిమా నుండే తనదైన శైలి నటన మరియు స్టైల్ తో ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చాడు.

అలా కెరీర్ ప్రారంభం లోనే యూత్ ఐకాన్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్, ఖుషి ( Pawan Kalyan, Khushi )చిత్రం నుండి తనకి తానే సాటి, ఎవ్వరూ లేరు పోటీ అనే విధంగా ఎదిగాడు.ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని, కొత్త తరం ప్రేక్షకులను పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఆకట్టుకునేవాళ్ళు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే మన టాలీవుడ్ హీరోలు పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లిన తెలుగు స్టేట్స్ లో ఓపెనింగ్స్ విషయం లో పవన్ కళ్యాణ్ తర్వాతే అని ట్రేడ్ పండితులు సైతం చెప్తూ ఉంటారు.

అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో తో పని చెయ్యాలని ప్రతీ దర్శకుడికి ఉంటుంది.కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వల్ల ఆయన మిగిలిన హీరోలు లాగా డైరెక్టర్ కోరినంత కాల్ షీట్స్ ఇవ్వలేడు.అందుకే టాప్ డైరెక్టర్స్ ఆయన తో సినిమాలు చెయ్యడానికి ఈమధ్య భయపడుతున్నారు.

Advertisement

రాజమౌళి,శంకర్ వంటి డైరెక్టర్స్ కూడా ఇదే కారణం చెప్పారు.ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అయిపోయాడు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు సినిమా చేస్తారు అని బోయపాటి శ్రీను ని ఒక యాంకర్ అడగగా, దానికి బోయపాటి శ్రీను సమాధానం ఇస్తూ నాతో సినిమా అంటే 40 , 50 రోజులు డేట్స్ ఇస్తే అసలు సరిపోదు అంత తక్కువ సమయం లో నేను సినిమాలను తియ్యలేను అని అంటాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఏ హీరో అయినా నా సినిమాకి 150 రోజుల డేట్స్ అవసరం ఉంటాయి.ఆయన అన్ని రోజులు డేట్స్ ఇవ్వగలిగితే కచ్చితంగా చేస్తాను.కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ గా బాగా లింక్ అయ్యి ఉన్నారు.

అందుకే అన్ని డేట్స్ కుదరకపోవచ్చు అని ఆలోచిస్తున్నాను కానీ, ఆయన లాంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను.ఇకపోతే రీసెంట్ గా ఆయన దర్శకత్వం లో వచ్చిన స్కంద చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి.సుమారుగా 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఈ నెల 27 తారీఖు నుండి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు