మీ మొబైల్ ఛార్జ‌ర్‌పై డబుల్ స్క్వేర్ గుర్తును గ‌మ‌నించారా? దాని అర్థం మీకు తెలుసా?

మీరు ఎప్పుడైనా ఫోన్ ఛార్జర్‌ను ప‌రిశీల‌న‌గా చూసారా? ఫోన్ ఛార్జర్లపై కొన్ని గుర్తులు ఉంటాయి.ఈ గుర్తులు ఫోన్ ఛార్జర్ వివ‌రాల గురించి తెలియజేస్తాయి.

ఈ గుర్తులలో డబుల్ స్క్వేర్ కూడా ఉంటుంది.ఇది ఛార్జర్‌కుండే లక్షణాన్ని తెలియజేస్తుంది.

డబుల్ స్క్వేర్ గుర్తు.డబుల్ ఇన్సులేట్‌కు సంకేతం.

అంటే విద్యుత్తుకు సంబంధించి డబుల్ సేఫ్ అని చెబుతుంది.దీన్నే క్లాస్ సెకండ్ సింబల్ అని కూడా అంటారు.

Advertisement

ఇది విద్యుత్ షాక్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.ఈ ఎలక్ట్రిక్ ఛార్జర్ చాలా సురక్షితం అని అర్థం.

చాలా ఛార్జర్‌లలో ఆ ఛార్జర్‌కు సంబంధంచిన‌ వివరాలు రాసివుంటాయి.ఇందులో ఎక్కువగా సాంకేతిక సమాచారం ఉంటుంది.

అలాగే అనేక లోగోలు కూడా ఉంటాయి.వీటిలోని ప్రతి గుర్తు సాంకేతిక లక్షణం గురించి తెలియ చెబుతుంది.

అలాగే ఈ ఛార్జర్‌కు ఎర్తింగ్ అవసరం లేదని,ఇతర సేఫ్టీ కనెక్షన్ అవసరం లేదని పేర్కొంటుంది.ఛార్జ‌ర్ వాడేట‌ప్పుడు కొన్ని విష‌యాలు గుర్తుంచుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒక ఛార్జర్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేస్తే బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.అందుకే మరొక ఛార్జర్‌తో ఫోన్‌ ఛార్జ్ చేయవద్దు.

Advertisement

మొబైల్ ఛార్జర్ పాడైపోతే అదే కంపెనీకి చెందిన ఛార్జ‌ర్ కొనుగోలు చేసి.వినియోగించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు