Sivaji: హీరో నితిన్ కి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ అంత పెద్ద సహాయం చేశారా.. ఎవరికి తెలియని నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో తెర వెనుక ఎంతోమంది సెలబ్రిటీలు సహాయం చేసుకుంటూ ఉంటారు.అలాగే వీరి మధ్య ఉండే రిలేషన్ కూడా చాలా మందికి తెలియదు.

అయితే తాజాగా హీరో నితిన్ కి బిగ్ బాస్ 7( Bigg Boss7 ) హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చిన హీరో శివాజీ ఆ సహాయం చేశారా అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ శివాజీ నితిన్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.

నితిన్ కి శివాజీ చేసిన సహాయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నటుడు శివాజీ ( Shivaji ) సినిమాల్లోకి రాకముందు కొన్ని ఫ్యాక్టరీలలో క్లీనింగ్ సెక్షన్లో పనిచేసేవారట.

ఆ తర్వాత తన బంధువు ద్వారా దూరదర్శన్ ప్రొడ్యూసర్ జీవి సుబ్బారావు( G.V.Subbarao ) తో సాన్నిహిత్యం ఏర్పడి సినిమా ఇండస్ట్రీ మీద మక్కువ పెరిగింది.ఆ తర్వాత అప్పుడే కొత్తగా వచ్చిన జెమినీ టీవీ( Jemini TV ) లో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

అయితే హీరో అవ్వాలని శివాజీ ఎప్పుడు కూడా అనుకోలేదట.కానీ అనుకోకుండా ఈయనకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ హీరోగా మారే అవకాశం వచ్చింది.

అయితే మొదట్లో శివాజీ నితిన్( Nithiin ) నటించిన రెండు సినిమాలకి డబ్బింగ్ చెప్పారట.అసలు విషయం ఏమిటంటే.నితిన్ తొలి సినిమా జయం ( Jayam) లో నితిన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో కాదు హీరో శివాజీనేనట.

అలాగే సూపర్ హిట్ అయిన దిల్ సినిమాలో కూడా నితిన్ కి శివాజీనే డబ్బింగ్ చెప్పారట.ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నితిన్ కి కాస్త నత్తి ఉండేదట.

ఈ కారణంతో డైలాగులు సరిగా చెప్పకపోవడంతో ఆయన డబ్బింగ్ చెప్పే శివాజీ సహాయం తీసుకోవలసి వచ్చింది.అంతేకాదు దిల్ సినిమా( Dil Movie ) కి గాను ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు సైతం శివాజీ అందుకోవడం గమనార్హం.అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నితిన్ కి అంత సహాయం చేసిన శివాజీ బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లారు కాబట్టి ఆయన తరపున సహాయం ఏమైనా ఉంటుందా అనేది ముందు ముందు చూడాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు