ధర్మపురి అరవింద్ తో బిజెపికి ముప్పే ?

తెలంగాణ బిజెపి గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.

ఒకవైపు అధికార బి‌ఆర్‌ఎస్( Brs ) మరియు కాంగ్రెస్ ( congress )పార్టీలో ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేసి నానా హడావిడి చేస్తుంటే బీజేపీ మాత్రం ఇంకా నిమ్మకు నీరేత్తినట్లు కనిపిస్తోంది.

నేతలు దూకుడుగా కనిపిస్తున్నాప్పటికి ఆశించిన స్థాయిలో జోష్ కనిపించడం లేదంటే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.ఇక పార్టీ నేతల్లో గత కొన్ని రోజులుగా అంతర్గత విభేదాలు బయట పడుతున్న వేళ వాటిని తగ్గించేందుకు అధిష్టానం ఈ మద్య తెలంగాణ బీజేపీపై గట్టిగానే ఫోకస్ పెట్టింది.

కాగా కేవలం నేతల విభేదాలే కాకుండా ఆయా నియోజిక వర్గాల్లో పలువురు కీలక నేతలపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఈ మద్య కాషాయ పెద్దలకు తలనొప్పిగా మారింది.

ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజిక వర్గంలో దర్మపురి అరవింద్( Dharmapuri Arvind ) పై గత కొన్నాళ్లుగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.పార్టీలోని నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా పదవుల మార్పు చేయపడుతున్నారని, ఇలా చేయడం కరెక్ట్ కాదని నియోజిక వర్గంలోని బీజేపీ కార్యకర్తలు నేతలు.బహిరంగంగానే అరవింద్ పై వ్యతిరేక గళం వినిపించారు.

Advertisement

ఇక తాజాగా అరవింద్ కారణంగా బీజేపీకి ఈ నియోజిక వర్గంలో గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.ఆర్మూర్ నియోజిక వర్గ ఇంచార్జ్ బీజేపీ నేత పొద్దుటూరి వినయ్ కుమార్( Podduthuri Vinay Kumar ) త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

దర్మపురి అవావింద్ తో వున్న విభేదాల కారణంగానే ఆయన పార్టీ మారబోతున్నట్లు టాక్ నడుస్తోంది.ఆ నియోజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న పుద్దుటూరి వినయ్ కుమార్ సీటు ఆశిస్తుండగా.ఆ నియోజిక వర్గ సీటు ఇతరులకు కేటాయించే విధంగా అరవింద్ ప్లాన్ చేస్తున్నాడట.

అందుకే వినయ్ కుమార్ పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు టాక్.ఇదే గనుక నిజం అయితే ఆర్మూర్ నియోజిక వర్గంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే.

అసలే నియోజిక వర్గాల వారీగా బలమైన నేతల కొరత ఉన్న కాషాయ పార్టీకి ఉన్న నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.మరి విభేదాలకు కారణం అవుతున్న ధర్మపురి అరవింద్ విషయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు