రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవరూ చెప్పలేరు.ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు.
తన ఇద్దరు కుమారుల్లో ఒకరైన ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ తరఫున గెలిచారు.మరో కొడుకు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యాడు.ఒకే కుటుంబంలో ని ముగ్గరు వ్యక్తులు మూడు పార్టీలకు చెంది ఉన్నారన్న వ్యాఖ్యలపై తాజాగా డీఎస్ స్పందించారు.ఆయనేమన్నారంటే….
అసలు నేను టీఆర్ఎస్ ఎంపీనేనా అనే విషయాన్ని కేసీఆర్ నే స్వయంగా అడిగి తెలుసుకోవాలని మాజీ పీసీసీ ఛీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు.తాజాగా ఆయన చేసిన వ్యఖ్యలు సంచలనంగా మారాయి.టీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎటువంటి ఆహ్వానాలు అందడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.కొంత మంది కావాలనే ఒకే ఇంట్లో మూడు పార్టీలంటూ తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.చాలా మంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో భర్త మరొక పార్టీలో ఉండడం లేదా అని ప్రశ్నించారు.
తన చిన్న కొడుకు అర్వింద్ బీజేపీలోకి వెళ్లినప్పుడు తాను ఎంత మాత్రం అర్వింద్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు.తాను కష్టపడి ఎంపీగా గెలిచాడన్నారు.

తన కొడుకులిద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని పేర్కొన్నారు.పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కూడా రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.తనతో పాటే టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని తెలిపారు.శ్రీనివాస్ కుటుంబం ఇలా కావడం వెనుక కొంత మంది వ్యతిరేఖ శక్తుల హస్తం ఉందని పలువురు చెబుతారు.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం డీఎస్ చేశారని పలువురు పరిశీలకులు చెబుతున్నారు.కాగా తన పెద్ద కొడుకు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశాడని చెబుతున్నారు.