దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన గూండా సంతోషి( Goonda Santoshi ) అనే యువతికి గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కింది.

విశాఖపట్నంకు చెందిన మహిళా మనోవికాస్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే క్రొచ్చెట్స్‌ తయారీలో ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించింది.

దేవరకొండ( Devarakonda ) పట్టణానికి చెందిన వీరమల్ల కృష్ణయ్య కుమార్తె గూండా సంతోషి గత ఏడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 450 మంది చిన్నారులు,యువతులు, మహిళలు,వృద్దులతో కలిపి అతి తక్కువ సమయంలో 58,112 క్రోచ్చెట్‌ స్క్వెర్స్‌ను తయారు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం వెంకోజీపాలెంలోని చందన మోహన్‌రావు ఫంక్షన్‌ హాల్లో వీటిని ప్రదర్శించారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ లండన్‌ ప్రతినిధి స్వప్నిల్‌ డంగారికర్‌ పరిశీలించి లార్జెస్ట్‌ డిస్ప్లే ఆఫ్‌ క్రోచ్చెట్‌ స్క్వెర్స్‌ గా గిన్నిస్‌ రికార్డును ధృవీకరించారు.ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు దేవరకొండ అమ్మాయికి దక్కడం ఎంతో గౌరవప్రదమని,దేవరకొండకే కాదు నల్లగొండ జిల్లాకు, రాష్ట్రానికి ఆమె వన్నె తెచ్చిందని పలువురు ప్రముఖులు,జిల్లా వాసులు అభినందనలు తెలిపారు.

ఈ ఘనత సాధించడంపై తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Latest Nalgonda News