ఈ నూనెతో దీపం వెలిగించారో అంతే సంగతులు!

ప్రతి రోజు మనం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రపరిచి దీపారాధన చేస్తూ ఉంటాము.

అలా చేయడం వల్ల మన ఇంటిలో ఉన్న దుష్టశక్తులు వైదొలిగి సకలసంపదలతో, సుఖ సంతోషాలతో కలిగి ఉంటామని పెద్దలు చెప్తుంటారు.

మరి దీపారాధన చేయడానికి ఏ నూనె మంచిది.? ఏ నూనె వాడటం వల్ల మంచి చేకూరుతుంది? ఏది వాడకూడదు? అనే మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.మనం రోజూ ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేయడం మంచిది.

ఈ దీపారాధనను మహిళలే చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకుని తర్వాత దీపారాధన చేయాలి.

నెయ్యితో దీపారాధన చేసే చేయడం వల్ల సంపదకు లక్ష్మీదేవి అనుగ్రహం, చదువుకు సరస్వతీ దేవి అనుగ్రహం కలుగుతుంది.నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ప్రేత భూత దుల బాధ నుండి విముక్తి కలుగుతుంది.

Advertisement

అంతే కాదు శని మహాదశలో శనీశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది.ఆముదం నూనెతో దీపారాధన చేయడం వల్ల కీర్తి సంపదలతో పాటు ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.

కొబ్బరి నూనెల మిశ్రమంతో క్రమం తప్పకుండా దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.దీపారాధనలో వేరుశెనగ నూనె, పామ్ ఆయిల్ వంటివి అసలు వాడకూడదు.ఈ నూనెలు దీపారాధనలో వాడటం వల్ల అప్పులు అవుతాయి.

ఇంట్లో ఎప్పుడూ చికాకులు, గొడవలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందువల్ల ఈ నూనెలను దీపారాధనకు వాడకూడదు.

ఈ నూనెలను ఇంటిలోనే కాకుండా దేవాలయాలలో కూడా దీపారాధనకు ఉపయోగించకూడదు .

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు