తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో తీవ్ర నిరాశ‌.. పీసీసీ మార్పు ఇంకెప్పుడు?

తెలంగాణ కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి వివాదాలే త‌లెత్తుతున్నాయి.ఆ పార్టీలో ఒక‌రంటే ఒక‌రికి స‌రిగ్గా మ‌ద్ద‌తు ఇవ్వ‌రు.

ఎవ‌రికి వారే అన్న‌ట్టు వ‌ర్గాలుగా విడిపోతుంటార‌నే భావ‌న ఇత‌ర పార్టీల్లో ఉంది.ఇక ఇలాంటి మాట‌ల‌కు అద్దం ప‌ట్టిన‌ట్టే ఉంటాయి కాంగ్రెస్ నేత‌ల ప‌నులు.

ఎవ‌రికి వారే బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తారు.అంతే కాదు ఒక‌రిపై ఒక‌రు ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ ఆరోప‌ణ‌లు చేస్తారు.

ఇక పీసీసీ ప‌ద‌వి గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆ ప‌ద‌విపై ఎప్ప‌టి నుంచో వివాదాలు చెల‌రేగుతున్నాయి.

Advertisement

ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచే నాకంటే నాకంటే నేత‌లు పోటీకి దిగుతున్నారు.ఇక వారికి ఇవ్వ‌కుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇందులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, జ‌గ్గారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, వీహెచ్ లాంటి నేత‌లు బ‌హిరంగంగానే పోటీ ప‌డుతున్నారు.ఇక ఇప్పుడు మ‌రోసారి పీసీసీ చీఫ్ ఎన్నిక తెర‌మీద‌కు రావ‌డంతో అంద‌రూ దీనిపై ఆశ‌లు పెట్టుకుంటున్నారు.

త‌మ‌కే ఇవ్వాలంటూ మ‌ళ్లీ డిమాండ్లు చేస్తున్నారు.

ఇక ఇందులో మొద‌టి నుంచి రేవంత్‌రెడ్డి, వెంక‌ట్‌రెడ్డి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.అయితే రేవంత్ ఇస్తే బాగుండ‌ద‌ని సీరియ‌న్లు వాదిస్తున్నారు.కానీ రీసెంట్‌గా ఆయ‌న ఢిల్లీ వెళ్ల‌డంతో ఆయ‌న‌కే క‌న్ఫ‌ర్మ్ అని వార్త‌లొచ్చాయి.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

అదేంటో గానీ ఈ ఎన్నిక మ‌ళ్లీ వాయిదా ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.దీంతో కాంగ్రెస్ నేత‌ల్లో తీవ్ర నిరాశ నెల‌కొంది.

Advertisement

నెల‌ల త‌ర‌బ‌డి ఊరిస్తున్నా.

ఇంకా మార్పు లేద‌ని అంతా భావిస్తున్నారు.చాలా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే పీసీసీ చీఫ్‌ను మార్చింది కాంగ్రెస్‌.కానీ తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

త్వ‌ర‌లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా రాబోతోంది.మ‌రి ఆలోపైనా చీఫ్‌ను నియ‌మిస్తే బాగుటుంద‌ని అంతా అనుకుంటున్నారు.

మ‌రి అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు