డిసెంబర్ నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. ఎన్ని సినిమాలు హిట్టయ్యాయంటే?

2021 సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే 2021 డిసెంబర్ స్థాయిలో 2022 డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి.

2022 డిసెంబర్ లో ఏకంగా 38 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాలలో హిట్టైన సినిమాలు కేవలం మూడు మాత్రమే కావడం గమనార్హం.హిట్2, అవతార్2, ధమాకా మినహా డిసెంబర్ లో విడుదలైన సినిమాలేవీ కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించే స్థాయిలో హిట్ కాలేదు.కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజయ్యాయో ప్రేక్షకులకు కూడా తెలియదంటే ఆ సినిమాల పరిస్థితి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదలైన హిట్2 హిట్ అనిపించుకోగా మట్టి కుస్తీ, జల్లికట్టు బసవ, నేనెవరు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

డిసెంబర్ రెండో వారంలో భారీ అంచనాలతో గుర్తుందా శీతాకాలం మూవీ రిలీజ్ కాగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా మెప్పించలేదు.ముఖచిత్రం, పంచతంత్రం సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చే విషయంలో ఫెయిలయ్యాయి.డిసెంబర్ 16వ తేదీన విడుదలైన అవతార్2 హిట్ కాగా ఆక్రోశం, శాసనసభ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలయ్యాయి.

ఆ తర్వాత వారంలో విడుదలైన కనెక్ట్, లాఠీ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి.ధమాకా, 18 పేజెస్ ఒకేరోజు థియేటర్లలో విడుదల కాగా ధమాకా మాస్ ప్రేక్షకులకు తెగ నచ్చింది.ఈ ఏడాది చివరి వారం లక్కీ లక్ష్మణ్, డ్రైవర్ జమున, టాప్ గేర్, ఎస్5 సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు.2023 జనవరిలో పలు క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాల్సి ఉంది.

Advertisement
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

తాజా వార్తలు