'అత్త'ను దారుణంగా కొట్టింది.. జైలుకెళ్లింది!

కాలం మారింది.కోడలిని అత్త తిట్టి, కొట్టేరోజులు పోయాయి.

కోడల్లే అత్తని కొట్టే రోజులు వచ్చాయి అని అనడానికి ఈ వీడియోనే ఆదర్శం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Indian Daughter-in-law Caught Beating Mother-in-law, Daughter In Law, Beating, M

హర్యానాలోని సోనిపట్‌లో 82 ఏళ్ల మహిళ తన కొడుకు, కోడలు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. కోడలు స్థానికంగా ఏఎన్‌ఎంగా విదులు నిర్వహించగా కొడుకు పాల వ్యాపారం చేసేవాడు.

అయితే కోడలుకు అత్తకు అసలు పడదు.నిత్యం గొడవలు పడేవారు.కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలు అత్తని కొట్టేది, తిట్టేది.82 ఏళ్ళ వయసు ఉన్న అత్తకు కోడలు పని చెప్పేది.ఒకవేళ ఆ పని చెయ్యకపోతే విసుక్కుంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేసి కొట్టేది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఆ వృద్ధురాలికి పని చెప్పినప్పటికి చేయకపోవడంతో కోడలు తీవ్ర ఆగ్రహానికి గురైంది.తీవ్ర కోపానికి గురైన కోడలు చెత్త ఎత్తే డేస్ పాన్ తో అత్త తలపై కొట్టింది.

దీంతో ఆ వృద్ధురాలు ఏడుస్తూ లోపలికి వెళ్తుంటే ఆమెను వెంటాడి మరి దారుణంగా కొట్టింది.అయితే ఇలా అత్తను కొట్టడం చూసిన ఆ వృద్ధురాలి మనవరాలు వీడియో తీసి తండ్రికి పంపించడమే కాకుండా సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ గా మారింది.

అంతే వీడియో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో కోడలిని, ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!
Advertisement

తాజా వార్తలు