'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ డేట్ మార్చిన మేకర్స్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ ఉండగా ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఇటీవలే ఆచార్య సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచి పోయింది.

దీంతో ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నుండి వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Advertisement

వరుస ప్రొమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్న టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా లాక్ చేసినట్టు సమాచారం.మరి ఈ ఈవెంట్ పై తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది.

మొన్నటి వరకు ఈ ఈవెంట్ 25న చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు డేట్ మార్చి కొత్త డేట్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 28న ఫిక్స్ చేసినట్టు టాక్.ఈ విషయంలో సరైన సమాచారం రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.అందుకే ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..

సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .బి .చౌదరి నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు