టీడీపీకి దెబ్బేసింది వారసులేనా ?

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టీడీపీ ఈ ఎన్నికల్లో ఎందుకు వెనకబడింది అనే విషయమే.

టీడీపీ అధినాయకుడి కూడా ఈ విషయం నిద్ర పట్టనీయడంలేదు.

విభజన కష్టాల్లో ఉన్న ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఎప్పుడూ జరగనంత స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ఎన్నికల్లో ఎందుకు మనం ఓటమి చవిచూడాల్సి వస్తోంది అనే విషయమై బాబు పార్టీ నాయకులతో చర్చిస్తూ లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికల ముందు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని టికెట్లు కన్ఫర్మ్ చేశారు.

ముందుగా ప్రతి నియోజకవర్గంపై సమీక్ష చేసి, అక్కడి కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని మరీ టిక్కెట్లు కేటాయించారు.అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది.

ఇప్పుడు అదే సమస్యగా మారిందన్న చర్చ టీడీపీలో నడుస్తోంది.పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న కొంతమంది బాబు కోటరీ నాయకుల ఒత్తిడి మేరకు బాబు కి ఇష్టం లేకపోయినా ఆయా నేతల వారసులకు టికెట్లు కేటాయించారు.

Advertisement

అయితే పోలింగ్ సమయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్నది ఈనెల 11వ తేదీన తేలింది.దీంతో వారసులకు టిక్కెట్లు ఇచ్చి తప్పు చేశామా అన్న భావన బాబులో ఎక్కువగా కనిపిస్తోంది.

అసలు వారసులు ఓటమి చెందడం వెనుక రీజన్ ఏంటి అనే విషయాన్ని బాబు రాబట్టగలిగాడు.వారసులు పోటీ చేసిన అనేక నియోజకవర్గాల్లో కీలకమైన నేతలు పార్టీ నుంచి ముందుగానే బయటకు వెళ్లిపోగా, మరికొందరు పార్టీలోనే ఉండి సహాయ నిరాకరణ చేశారన్నది బాబు పరిశీలనలో తేలింది.

వారసులు పోటీ చేసిన అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కన్పించింది.సీనియర్ నేతల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం వీరిలో కన్పించలేదన్నది ప్రధాన కారణంగా ఇప్పుడు తేలింది.దీనికి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేసి ఉంటే ఎన్నిక ఏకపక్షమయ్యేదేనని అంటున్నారు.

సునీత కోరిక మేరకే ఆమె వారసుడు పరిటాల శ్రీరామ్ కు సీటిచ్చారు.అయితే నియోజకవర్గంలో ఉన్న మహిళలు, తటస్థులు శ్రీరామ్ వైపు మొగ్గుచూపలేదంటున్నారు.ఇక తాడిపత్రిలోనూ అంతే.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
Aishwarya Dutta Making A Fuss With Beauty Viral Latest Photos

జేసీ కుటుంబానికి కంచుకోట అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి బరిలోకి దిగడంతో గెలుపుపై సందేహాలు మొదలయ్యాయి.అలాగే శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి టిక్కెట్ దక్కంది.

Advertisement

గోపాలకృష్ణారెడ్డి అయితే కచ్చితంగా గెలిచేవారన్నది బాబు పరిశీలనలో తేలింది.కర్నూలు సీటీ నియోజకవర్గంలోనూ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ పై ప్రజల్లో సానుకూల దృక్పధం కనిపించలేదట.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారసులకు టికెట్ దక్కిన ప్రతి చోటా ఇదే పరిస్థితి తలెత్తి టీడీపీ విజయావకాశాలను దెబ్బతీయబోతున్నట్టు తేలిందట.

తాజా వార్తలు