ఈస్టర్ రోజున శ్రీలంకలో ఘోరం! క్రైస్తవులే టార్గెట్ గా ఉగ్రదాడి

ప్రపంచం మొత్తం క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ వేడుకని జరుపుకుంటుంది.అందరూ భక్తులు క్రీస్తు ఆరాధనలో మునిగిపోయారు.

 Terrorist Serial Bomb Blasts In Sri Lanka-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఉగ్రభూతం వారిని భయపెడుతుంది అని అస్సలు ఊహించి ఉండరు.అయితే శ్రీలంకలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు.

రాజధాని కొలంబో సహా.చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లకి పాల్పడ్డారు.చర్చిలని టార్గెట్ గా చేసుకొని ఈ దాడులు చేసారు.

కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో జరిగిన శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి.ఆ పేలుళ్లలో ఎంత మంది చనిపోయిందీ ఇంకా తెలియట్లేదు.80 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది.కోచికాడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి.చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై చాలా మంది గాయాలపాలయ్యారు.ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది.చర్చిలో ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు… చెల్లా చెదురుగా పరుగులు తీశారు.

మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube