రబీలో పెసర సాగు విధానం..సరైన యాజమాన్య పద్ధతులు..!

పెసర పంట ( Green Gram Cultivation )తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికి వచ్చే పంట.

ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒక ఎకరంలో దాదాపుగా ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు.

రబీ లో పెసరను సాగు చేస్తే రైతులు ( Farmers )చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.రబీ లో ఆరుతడి పంటలుగా పెసరను సాగు చేయడం ఉత్తమం.

పంట మార్పిడి లో భాగంగా పెసరను సాగు చేస్తే భూసారం కూడా పెంపొందేందుకు వీలు ఉంటుంది.తొలకరిలో సోయచిక్కుడు సాగు ( Soybean Cultivation )చేసిన ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు నీటి తడులతో చేతుకొచ్చే పెసర పంటను సాగు ( Green Gram Cultivation )చేయడం వల్ల పెట్టుబడి భారం తగ్గి దిగుబడి పెరుగుతుంది.

సెప్టెంబర్ రెండవ వారం నుండి అక్టోబర్ నెల చివరి వరకు ఈ పెసరను విత్తుకోవచ్చు.నవంబర్లో విత్తుకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేము.కాబట్టి అక్టోబర్ నెలలోనే విత్తుకోవడం మంచిది.

Advertisement

ఈ పెసర సాగుకు నల్లరేగడి, మధ్యస్థ, ఎర్రచల్కా నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు పెసర సాగుకు పనికిరావు.

ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చాలా ముఖ్యం.పెసర పంట తొలి దశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం.

విత్తన శుద్ధి( Seed treatment ) చేస్తే అనవసర పిచికారి రసాయన మందులను( Chemical drugs ) వాడాల్సిన అవసరం ఉండదు.పైగా భూమి ద్వారా వ్యాపించే శిలీంద్ర తెగుళ్ల నుండి పంట సంరక్షించబడుతుంది.

రబీ పెసరలో సాళ్ల మధ్య దూరం కాస్త ఎక్కువగా ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.విత్తిన పది రోజుల వ్యవధిలో ఒకసారి కలుపును నివారించాలి.ఇక వాతావరణంలో మార్పులు జరిగితే పంటను గమనించి ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు( Pests ) ఆశించి ఉంటే తొలి దశలోనే అరికట్టే ప్రయత్నం చేస్తే నాణ్యమైన మంచి దిగుబడి పొందవచ్చు .

ఇంతమందిని కూర్చోబెట్టడం ఎందుకు ... నిఖిల్ కే కప్ ఇస్తే సరిపోతుంది కదా ?
Advertisement

తాజా వార్తలు