Kunamneni Sambasiva Rao: దురుద్దేశం తోనే మోడీ పర్యటన - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల అనంతరం హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు చడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునమనేని సాంబశివరావు లను కలిసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

దేశ ప్రధాని కి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చింది.12 వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసింది.దురుద్దేశం తోనే మోడీ పర్యటన.

ఎన్నికల తరువాత విజయం సాధించి ఈ ఫ్యాక్టరీ ప్రారంభిద్దామని అనుకున్నారు.షెడ్యూల్ కూడా అప్పటిదే.

గత సంవత్సరం ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రారంభించడం ఏంటి.దానిని మేము ఏదో చేశామని మీ ఖాతాలోవేసుకుందాంనుకున్నారా.

మీకు నైతికత లేదు.మీరు టెక్నీకల్ ప్రధాని మాత్రమే.

Advertisement

ఇక్కడ మీ ప్రభుత్వం లేదు.ఎమ్మెల్యేలను గుంజుకొని ప్రభుత్వంకూల్చాలనుకుంటున్నారు.8 సంవత్సరాల్లో తెలంగాణ కి మీరు ఏం చేశారు.విభజన చట్టంలోని ఏఒక్క హామీ అయిన నెరవేర్చరా.? మీ మంత్రి కిషన్ రెడ్డి ద్వారా బయ్యారం స్టార్ట్ కాదని చెప్పారు.సింగరేణి ఫ్రవేటికరణ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.

మా తెలంగాణ గడ్డ మీద ఉన్న బొగ్గు బావులను ఆదాని, అంబానీ కి కేటాయించిన నువ్వు మా గడ్డ మీద అడుగు ఎలా పెడతావ్.మా బ్యాంక్ ,ఉక్కు కర్మాగారాలు,lic లు ప్రైవేటు కు ఇస్తే ఎలా.ప్రధాని మోడీ తెలంగాణ కు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం.10 వ తేదీ నుండి బొగ్గు కర్మాగారంలో ఆందోళన చేస్తాం.తెలంగాణ లో మంత్రులను నా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారు.

మీరు గవర్నర్ రా.లేక బీజేపీ కార్యకర్తనా.ముందు తేల్చాలి.

తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ లో గవర్నర్ ల తీరు సరిగా లేదు.గవర్నర్ ల వ్యవస్థ సరిగా లేదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

బ్రిటిష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థ ని రద్దు చేయాలి.మేము మా జాతీయ మహాసభ ల్లో కూడా తీర్మానం చేసాం.

Advertisement

తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి.త్వరలో పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడి చేస్తాం.

తాజా వార్తలు