అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.దక్షిణాది భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా ఈయన పేరు గడించాడు.
ఇప్పటికి ఈయన భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు.అయితే బాహుబలి వంటి సినిమా తర్వాత శంకర్ వైపు ఉన్న ద్రుష్టి రాజమౌళి వైపు మళ్లడంతో టాప్ డైరెక్టర్ అంటే రాజమౌళి పేరునే చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఈయన మాత్రం మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు.శంకర్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు శంకర్ గత కొన్ని రోజులు క్రితం మధ్యలోనే వదిలేసిన ఇండియన్ 2 సినిమా ఇప్పుడు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
![Telugu Shankar, Indian, Kamal Haasan, Kamal Hasan, Kollywood, Ram Charan, Rc, Sh Telugu Shankar, Indian, Kamal Haasan, Kamal Hasan, Kollywood, Ram Charan, Rc, Sh]( https://telugustop.com/wp-content/uploads/2022/11/Ram-Charan-Director-Shankar-kamal-hasan.jpg)
ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న శంకర్ మరొక సినిమాను కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.అది కూడా ఒక నవల ఆధారంగా అని టాక్.ఇటీవలే మణిరత్నం కూడా ఒక తమిళ్ నవల ఆధారంగా పొన్నియన్ సెల్వన్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా ఇప్పుడు మరో పార్ట్ తెరకెక్కుతుంది.
అలాగే శంకర్ కూడా వేల్పరి అనే నవల ఆధారంగా సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమాను ఏకంగా మూడు పార్టులుగా తెరకెక్కించ బోతున్నారట.
తమిళ్ లో పాపులర్ అయిన ఇతిహాస నవల ఇది.ఇది పెద్ద నవల కావడంతో మూడు పార్టులుగా చేయాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే మూడు భాగాలుగా చేసి స్క్రీన్ ప్లే కూడా రెడీ చేశారట.అయితే ఇది కేవలం తమిళ్ నవల కావడంతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఆకట్టుకునేలా తీయగలుగుతాడా లేదా అనేది చూడాలి.