అర‌టి పండ్లు కూలీ త‌ల‌మీద ప‌డ్డందుకు రూ.4కోట్ల ప‌రిహారం చెల్లించాల‌న్న కోర్టు

మ‌నం రోజూ ఎన్నో ర‌కాల వార్త‌లు వింటూనే ఉంటాం.అయితే ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయే వార్త విన‌డానికే కాదు ఊహించ‌డానికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

సోష‌ల్ మీడియా అంటేనే ఇలాంటి విచిత్ర‌మైన వార్త‌ల‌కు నెల‌వు క‌దా.అందుకే దీన్ని చాలా ఫాస్ట్‌గా వైర‌ల్ చేసేస్తున్నారు నెటిజ‌న్లు.

ఇక‌పోతే మ‌నం ప‌రిహారం అనే విష‌యం మాట్లాడుకుంటే ఇది ఏదైనా ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ప్పుడు స‌ద‌రు కార‌కులు బాధితుల‌కు చెల్లించేది.అయితే దీనికి కూడా కొన్ని నిబంద‌న‌లు ఉంటాయి క‌దా.

ఏదైనా పెద్ద ప్ర‌మాదం జ‌రిగి పెద్దగా ప్రాణ న‌ష్ట‌మో లేదంటే ఆస్తి న‌ష్ట‌మో జ‌రిగితేనే దీన్ని చెల్లించాల‌నే రూల్స్ ఉంటాయి.అయితే ఇప్పుడు ఓ ఫ‌న్నీ వార్త అది కూడా ప‌రిహారానికి సంబంధించిందే మ‌నం తెలుసుకోబోయేది.

Advertisement

ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్‌ల్యాండ్ సిటీలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.అయితే 2016వ సంవత్సరంలో ఓ ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ క్వీన్‌ల్యాండ్ ప‌ట్ట‌ణంలో నివ‌సించే ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు సంబంధించిన ఓ అరటి తోట ఉంది.ఈయ‌న తోట‌లో చాలా కాలంగా లాంగ్‌బాటమ్ అనే కూలీ ప‌నిచేస్తున్నాడు.

ఓ రోజు ఈ కూలీ తోట‌లో త‌న ప‌ని తాను చేస్తుండగా.అనుకోకుండా అరిటి పండ్లతో నిండి ఉన్న ట్రే త‌ల‌మీద ప‌డ‌టంతో అత‌ను గాయ‌ప‌డ్డాడు.

ఎంత‌లా అంటే ఆ దెబ్బ‌కు ఆ కూలీ వికలాంగుడిలా మారాల్సి వచ్చిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.ఇక విక‌లాంగుడు కావ‌డంతో అత‌ను పనిలేక దీన స్థితికి వ‌చ్చాడు.దీంతో త‌న‌కు ఎలాగైనా 502,740 డాలర్ల ప‌రిహారం కావాలంటూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

ఈ కేసు మీద అప్ప‌టి నుంచి విచారిస్తున్న కోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.ట్రే మీద పడి ఆ కూలీ జీవితాంతం విక‌లాంగుడిగా మారాల్సి వ‌చ్చిది కాబ‌ట్టి అత‌నికి ప‌రిహారంగా దాదాపు రూ.3,77,15,630 చెల్లించాల్సిందేనంటూ తీర్పు ప్ర‌క‌టించింది.దీంతో ఆ అరటి తోట యజమాని త‌లు ప‌ట్టుకుంటున్నాడు.

Advertisement

త‌న త‌ప్పు లేక‌పోయినా ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన దానికి త‌న‌కు ఇంత పెద్ద ఫైన్ వేయ‌డ‌మేంట‌ని వాపోతున్నాడు.

తాజా వార్తలు