ఆ హీరో ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన రాఘవ లారెన్స్..!

కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ హీరో రజనీకాంత్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు.

లారెన్స్ ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ ఫ్యాన్స్ కు తలైవా రాజకీయాల్లోకి ఎందుకు రావొద్దని చెబుతున్నాడనే విషయాలను వెల్లడించారు.

వల్లువర్ కూట్టమ్‌ దగ్గర జరిగే నిరసనల్లో పాల్గొనాలని లారెన్స్ ను చాలామంది రజనీకాంత్ అభిమానులు కోరగా లారెన్స్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం గురించి తాను కూడా బాధ పడుతున్నానని పేర్కొన్నారు.రజనీకాంత్ అనారోగ్యం వల్ల రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని ఆయన మరో కారణం చెప్పి ఉంటే తాను కూడా నిర్ణయం మార్చుకోవాలని అడిగేవాడినని లారెన్స్ వెల్లడించారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి అనారోగ్యం వల్ల ఏదైనా జరగకూడనిది జరిగితే జీవితానంతం ఫ్యాన్స్ బాధ పడాల్సి ఉంటుందని.రజనీకాంత్ తనకు ఎప్పటికీ గురువు అని లారెన్స్ పేర్కొన్నారు.

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి తనకు తెలుసని లారెన్స్ అన్నారు.

Advertisement

రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ గా ప్రార్థించాల్సిన అవసరం ఉందని. నా ప్రార్థనలు రజనీకాంత్ కోసం ఎప్పటికీ ఉంటాయని లారెన్స్ అన్నారు.రజనీకాంత్ అనారోగ్య సమస్యల వల్ల రాజకీయాల్లోకి రానని ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు రజనీ అభిమాన సంఘం యొక్క అధ్యక్షుడు భాస్కర్ విడుదల చేసిన ఒక ఆడియో సంభాషణలో ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి లతా రజనీకాంత్ సహాయం చేశారని పేర్కొన్నారు.నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టం దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమానికి వేదిక, వాటర్ క్యాన్లు, మొబైల్ టాయిలెట్ల కోసం సహాయం అందిందని భాస్కర్ పేర్కొన్నారు.

లతా రజనీకాంత్ అనుచరుడు సంతోష్ కూడా ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన పనులను పరిశీలించాలని భాస్కర్ తన ఆడియోలో పేర్కొనడం గమనార్హం.భాస్కర్ నిన్న విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆడియోలో భాస్కర్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని చేసిన ప్రకటన తమను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు