రోడ్ల మీద చిరంజీవి ఎన్నికల ప్రచారం ?

చిరంజీవి - రాజకీయాలు ఈ రెండూ పరస్పరం అచ్చిరాని అంశాలు.చిరంజీవికి రాజకీయాలు పెట్టిన దరిద్రం ఏ ఫీల్డ్ పెట్టలేదు.

ఎన్నో బిజినెస్ లు చేసాడు , ఎన్నో సినిమాలు చేసాడు , ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు కానీ రాజకీయాలు ఆయనకి కొరకరాని కొయ్య గానే మిగిలిపోయాయి.కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీ ప్రజారాజ్యాన్ని కలిపేసి అందులో విలీనం చేసి రాజ్యసభ పదవిని అనుభవించిన చిరంజీవి అప్పట్లో సమైక్య వాది గా చెప్పుకొని తెలంగాణా లో వ్యతిరేకత ని ఎదురుకొన్నారు.

ఏపీ లో చావు పడక మీద ఉన్నకాంగ్రెస్ ని చిరంజీవి చేతిలో పెట్టింది హై కమాండ్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోయారు.అది విభజన వలన అని ఈజీగా చెప్పచ్చు.

ఇప్పుడు గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగడం తో హైదరాబద్ సెటిలర్స్ మీద కాంగ్రెస్ చిరంజీవి ని ప్రయోగిద్దాం అని చూస్తోంది.గ్రేటర్‌లో సీమాంధ్రుల ఓట్ల ప్రభావం ఎక్కువగా వున్న డివిజన్లలో సీమాంధ్రులకే టిక్కెట్లు ఇస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రకటించేశారు.

Advertisement

దాంతోపాటుగా, చిరంజీవిని ప్రచారంలోకి దింపితే, సెటిర్ల ఓట్లు తమకే పడ్తాయన్నది టీఎస్‌ పీసీసీ ఆలోచన.చిరు దీనికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

నిజంగా అలా చిరు ఒప్పుకుని ప్రచారం చేసినా హైదరాబాద్ లో ఒక సమైక్య వాది అలా ప్రచారం చేస్తుంటే పక్కా తెలంగాణా అభిమానులు ఊరుకుంటారా ? .

Advertisement

తాజా వార్తలు