పోస్టు కార్డుతో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు

రాజన్న సిరిసిల్ల జిల్లా:ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు అగ్రనేత రాహుల్ గాంధీ పై పార్లమెంట్ లో ఎంపీ గా అనర్హత వేటు వేసిన అంశం పై పిసిసి అధ్యక్షుడు రెవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ లతో ర్యాలీగా వెళ్లి పోస్ట్ కార్యాలయం ముందు నిరసన తేలియజేసి ప్రధానమంత్రి నివాసానికి పోస్ట్ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని,ప్రధాన మంత్రి పేడుతున్న అక్రమ కేసులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయపడబోరని తెలిపారు.

రాహుల్ గాంధీ అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తి కాదని బిజేపి కావాలనే ఆయన పై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీ పోరాటానికి అన్ని పార్టీల నేతలు దేశ ప్రజలు అండగా నిలిచారని ఇక బిజేపి ప్రభుత్వం మోడి ఆటలు ఇక సాగవని హెచ్చారించారు.

Congress Ranks Who Took Up The Protest Program With Postcards , Postcards, Congr

ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి, బాలపోచయ్య , పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్,సీనియర్ నాయకులు ఓగ్గు రమేష్ ,బిసి సేల్ అధ్యక్షుడు ప్రసాద్, మైనర్టీ అధ్యక్షుడు జమాల్,గూడ నరేందర్ రెడ్డి,బాలయ్య, బాబు, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

Latest Rajanna Sircilla News