సొంత పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసిన నటి ఖుష్భూ

గత కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ మహిళా కాంగ్రెస్ నేత, సినీ నటి కుష్బూ అసంతృప్తితో ఉన్నారు.

దీంతో గతంలో బీజేపీ పార్టీని, మోడీ నాయకత్వాన్ని తీవ్ర విమర్శించిన ఈమె వాటిని తగ్గించింది.

మరో వైపు బీజేపీకి దగ్గర అయ్యేందుకు ఆ పార్టీ నిర్ణయాలకి అనుకూలంగా మాట్లాడుతుంది.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపధ్యంలో ఆ పార్టీని ఎక్కువ కాలం నమ్ముకొని ఉన్న పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి ఆమె పార్టీకి దూరం అయ్యే ప్రయత్నం చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో తాజాగా ఆమె కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.దేశం యావత్తు నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తుంది.

దీని వలన విద్యార్ధుల నైపుణ్యాలు పెరుగుతాయని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో కుష్బూ కూడా నూతన విద్యా విధానాన్ని స్వాగతించింది.

Advertisement

అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విద్యావిధానం మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.దీంతో ఆమె నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు పట్టారు.

దీనిపై ఆమె కాంగ్రెస్ పార్టీ నేథలకి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.నూతన విద్యా విధానాన్ని స్వాగతించడం కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను.ఇందుకు రాహుల్ గాంధీ గారూ నన్ను క్షమించాలి.

నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా.నేను రోబోను కాను.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

కీలు బొమ్మను అసలే కాను.ప్రతి విషయంలోనూ అధిష్ఠానానికి తలూపాల్సిన పని లేదు.

Advertisement

ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలి అని పేర్కొంది.మరి కుష్బూ దిక్కార స్వరాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు ఒప్పుకుంటుంది అనేది చూడాలి.

తాజా వార్తలు