కాంగ్రెస్ నిరుపేదల పార్టీ...ప్రజలే కాపాడుకోవాలి:బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా:నిరుపేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

హాథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం ఆరవ రోజు తోపుచర్ల,ఇసుక బావిగూడెం,గండ్రవాని గూడెం,కుక్కడంలో పర్యటించారు.

ఈ ప్రాంతంలోని ఇటుక బట్టీలకు దగ్గరకు చేరుకొని అక్కడి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటుక బట్టీ కార్మిక కుటుంబాల పిల్లలకు సరైన విద్య, వైద్యం అందించడంతో పాటు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

జోడయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, ఎంపీపీ పుట్టల సునిత కృపయ,సైదులు,పోలగాని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!
Advertisement

Latest Suryapet News