కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత..!

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి ఖండించారు.

ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అనడం సరికాదన్నారు.

బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్న మీ పార్టీ నాయకులు కూడా పొలిటికల్ టూరిస్టులేనా అని ప్రశ్నించారు.కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని విమర్శించారు.

ప్రియాంక గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు.ప్రియాంక గాంధీకి, రేవంత్ కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు