తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు.!: కిషన్ రెడ్డి

తెలంగాణ కోసం సమ్మె చేస్తే కాంగ్రెస్ స్పందించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అనేక కుంభకోణాలు జరిగాయన్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ కు దోచుకోవడం దాచుకోవడమే తెలుసని ఆరోపించారు.ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు.

అదేవిధంగా కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు అందరూ పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని వెల్లడించారు.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు