ఆ ఒక్క ఎంపీ సీటు పైనే కన్నేసిన కాంగ్రెస్, బిజెపి.. కారణం..?

తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక ప్రధాన పార్టీల చూపు పార్లమెంటు ఎన్నికల పైన పడింది.అయితే ఈసారి బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది.

గెలుస్తామని ఎంతో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ చివరికి ఓటమిపాలయ్యారు.అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ ( Congress ) పుంజుకొని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఇక గత ఎన్నికల్లో నాలుగు సీట్లకు పరిమితమైన బిజెపి ఈసారి 8 సీట్లు గెలిచి తెలంగాణలో కాస్త పట్టు సాధించింది.దాంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిజెపికి మెజారిటీ సీట్లు రావాలి అని బిజెపి అధిష్టానం భావిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆ ఒక్క ఎంపీ సీటు పైనే ఇటు కాంగ్రెస్ అటు బిజెపి రెండు పార్టీలు కన్నేసాయి.ఇక రెండు పార్టీలు ఫోకస్ చేసిన ఆ ఎంపీ సీటు ఏదో కాదు హైదరాబాద్.

Advertisement

అయితే హైదరాబాద్ ఎప్పటినుండో ఎంఐఎం ( MIM ) కి కంచుకోటగా ఉంటూ వస్తుంది.అయితే ఈసారి మాత్రం హైదరాబాదులోఎంపీ సీట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తూ ఉంటే బిజెపి కూడా హైదరాబాద్ ఎంపీ సీటులో భారీ మెజారిటీతో గెలవాలని చూస్తుంది.దీంతో ఇటు బిజెపి అటు కాంగ్రెస్ ఎంఐఎం కి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ సీటు పై కన్నేసాయి.

దాంతో బిజెపి( BJP ) , కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ ఎంపీ సీటు పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ కూడా తన ఎమ్మెల్యేలను పిలిపించుకొని జాగ్రత్తలు చెప్పారట.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లిం ఓట్లు ఇతర పార్టీలకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆ ఎమ్మెల్యేలందరికీ హెచ్చరించారట.ఇక రీసెంట్గా తెలంగాణకి వచ్చిన అమిత్ షా ( Amith sha ) కూడా తమ బిజెపి నాయకులకు హైదరాబాద్ ఎంపీ సీటు పైనే స్పెషల్ ఫోకస్ పెట్టమని దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందు వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు.

అలాగే హైదరాబాదులో ఎక్కువగా పోలింగ్ నమోదు కాకపోవడంతో బీఆర్ఎస్( BRS ) కి ఎక్కువ సీట్లు వచ్చాయని, ఓటు శాతం ఎక్కువగా నమోదైతే కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి ఉండేదని కొంతమంది భావించారు.ఇక ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలి అని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ నేపథ్యంలోనే హైదరాబాదు ఎంపీ సీట్ ( Hyederabad mp seat ) పై ఈసారి కాంగ్రెస్,బిజెపి, ఎంఐఎం మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని తెలుస్తోంది.మరి ఎప్పటిలాగే హైదరాబాదు లో ఎంఐఎం అభ్యర్థి గెలిచి సత్తా చాటుతారా లేక కాంగ్రెస్ లేదా బిజెపి పార్టీ ల అభ్యర్థులలో ఎవరో ఒకరు గెలుస్తారా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు