కాంగ్రెస్, బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నాయి.. కడియం శ్రీహరి

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో భారీగా అవినీతి పెరిగిందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు.

ప్రజలు ఇచ్చిన ఖడ్గంతో అవినీతిని అంతమొందిస్తానని తెలిపారు.

ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయాలి తప్ప డబ్బులు దండుకోకూడదని కడియం పేర్కొన్నారు.తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు.

బండి సంజయ్ ఉత్తర కుమారునితో సమానమని ఎద్దేవా చేశారు.ఈ క్రమంలో సన్నాసులు, దద్దమ్మల మాటలు విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ లో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

Latest Latest News - Telugu News