థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటూ సినిమాలో చెప్పిన డైలాగునే పేరుగా మార్చుకున్న కమెడియన్ పృథ్వి- మత ప్రబోధకుడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం మొదలయ్యింది.
ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ… విమర్శలు గుప్పించుకున్నారు.ఈ సందర్భంగా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై పృథ్వి మండిపడ్డారు.
‘మతప్రభోదకుడు అని బిరుదు పెట్టుకుని 271 దేశాలకు ఆశీర్వాదం ఇచ్చాను.మోదీకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను.
చంద్రబాబుకి ఆశీర్వాదం ఇచ్చానని చెప్పుకునే మీరు.నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు.

నువ్వేం మత ప్రభోదకుడువో.ప్రజాశాంతి అనే బొందలో పార్టీకి అధ్యక్షుడివో తెలియడం లేదు.ఈ ఐదేళ్లలో ఎక్కడు పోయావు పాల్.ఎన్నికలు వస్తున్నాయి కదా అని ఏదో గంగిరెద్దులు ఊపుకునే వాడిలా వచ్చేసి.వాళ్లు గెలుస్తారు.వీళ్లు గెలుస్తారు.
జగన్ అవినీతి పరుడు అనడానికి నీ దగ్గర ఏం ఉందిరా.ఆధారం.
నువ్ మాకు గౌరవం ఇవ్వలేదు కాబట్టే నీకు ఇవ్వడం లేదు.నీ దగ్గర నిజంగా అన్ని లక్షల కోట్లు ఉంటే చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ఒక లక్షకోట్లు.ఆంధ్రలో ఓ లక్షకోట్లు ఇవ్వు.
అసలు నిన్ను ఆ ఛానల్ (Tv 9) వాళ్లు ఎందుకు హైలైట్ చేస్తున్నారో తెలియదు.

నన్ను కమెడియన్, జోకర్ అంటూ తప్పుడు కూతలు కూస్తున్నావ్.నీది విశాఖ పట్నం అంటున్నావ్.నాదీ విశాఖపట్నమే.
నేను ఆంధ్రయూనివర్సిటీలో ఐదేళ్లు చదువుకుని వచ్చా.నీలా చదువుకోకుండా రాలేదు.
మత ప్రభోదకుడివి మత ప్రభోదకుడిలా ఉండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు.మనిషిని గౌరవించడం చేతకాని నువ్వేం మత ప్రభోదకుడివి.
మాట్లాడితే.జగన్ అలా.పవన్ ఇలా.చంద్రబాబు ఇలా అంటూ కూతలు కూస్తున్నావ్.నువ్వేమన్నా నీతిమంతుడివి అని బిల్ల కొట్టుకొని వచ్చావా? ఎప్పుడూ ఇలాంటి మాట్లాడకు.అసలు నీకు సిగ్గుందా.
బుద్ది ఉందా.మాట్లాడితే జగన్, చంద్రబాబులను నీతో ప్రెస్ మీట్‌కి రమ్మని పిలుస్తున్నావ్.
నువ్వంటే ఖాళీగా ఉన్నావ్.నీకు పనీ పాటా లేదురా.
నీ నోటిని ఫినాయిల్ వేసి కడగాలా’ అంటూ పృథ్వి నిప్పులు చెరిగారు.