హుజూర్ నగర్ సీఎం పర్యటనపై హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని కలెక్టర్,ఎస్పీ పరిశీలన

సూర్యాపేట జిల్లా:మార్చి 30 న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ తేజస్ నంద లాల్ పవార్,ఎస్పీ కె.

నరసింహ హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.

సిఎం పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సలహాలు,సూచనలు చేశారు.భద్రతను కట్టుదిట్టం చేయాలని,పోలీసు అధికారులు,సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,పట్టణ సీఐ చరమందరాజు,పోలీస్ సిబ్బంది,ఇతర అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

Latest Latest News - Telugu News