పరీక్షలు క్వాలిటీగా చేయాలి.. రిఫరల్ మరింత ఎక్కువ మందిని చేయాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలకు చేసే పరీక్షల క్వాలిటీ నీ పెంచుతూ.

రిఫరల్ ఎక్కువగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారుల ను ఆదేశించారు.

ఆరోగ్య మహిళా కార్యక్రమం పురోగతిపై సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఉన్నత వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సమీక్షించారు.ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1579 మంది మహిళల వివరాలను నమోదు చేయగా, వీరిలో 663 మందికి సంబంధించి 3005 పరీక్షలు చేశారని జిల్లా వైద్యాధికారి జిల్లా కలెక్టర్ కు చెప్పారు.

వీరిలో 2,375 మందికి పరీక్షలను ఇంకా విశ్లేషణ చేయలేదన్నారు.విశ్లేషించిన వారిలో 578 మంది రిపోర్టులు నార్మల్ వచ్చినట్లు 52 మంది మహిళల రిపోర్టులు అసాధారణంగా వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి కలెక్టర్ నివేదించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రభావంతంగా అమలు చేసేందుకు వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు.ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రభావంతంగా చేపట్టేందుకు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రోగ్రాం అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని జిల్లా వైద్యాధికారికి కలెక్టర్ సూచించారు.

Advertisement

అవసరమైతే ఆరోగ్య మహిళ కార్యక్రమం అమలవుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందిని మరింతగా పెంచుకోవాలన్నారు.తంగళ్ళపల్లి, నేరెళ్ల, పి ఎస్ నగర్, వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రతి మహిళకు ఆరోగ్య మహిళ క్రింద చేపడుతున్న ఎనిమిది టెస్టులను తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.

పరీక్షలను త్వరితగతిన చేపడుతూనే వాటిని సాధ్యమైనంత త్వరగా ల్యాబ్ టెక్నీషియన్ వద్దకు పంపి అనంతరం వచ్చే రిపోర్టులను జాగ్రత్తగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేపించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు సూచించారు.ల్యాబ్ టెక్నీషియన్ వద్ద కూడా మహిళల రిపోర్టుల ఫలితాలను నమోదు కు ఉద్దేశించిన రిజిస్టర్ ను ప్రత్యేకంగా పెట్టి నమోదులు చేపించాలన్నారు.ముఖ్యంగా క్లినికల్ బ్రెస్ట్ నిర్దారణ పరీక్షలు, ఓరల్ కాన్సర్ ,సర్వైకల్ క్యాన్సర్ పరీక్షల పై మరింత దృష్టి సారించాలన్నారు.

పరీక్షల వివరాలను ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఏఎన్ఎం లు డేటా ఎంట్రీ చేసేలా మెడికల్ ఆఫీసర్ లు పర్యవేక్షణ చేయాలన్నారు.ప్రాథమిక పరీక్షలో వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వారి వివరాలనూ గోప్యంగా ఉంచుతూ చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు.

వారు రిఫర్ ఆసుపత్రులకు వెళ్ళారా లేదా అనే విషయాన్ని ఆశా, ఏఎన్ఎం లు మానిటర్ తప్పనిసరిగా చేయాలన్నారు.రిఫరల్ కేసులకు కూడ నోడల్ స్టాఫ్ ను పెట్టీ మానిటర్ చేపించాలన్నారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఎనీమియా కేసులను సంబంధిత వైద్యాధికారులు పర్సనల్ గా ఫాలో అప్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఆరోగ్య మహిళా కార్యక్రమమును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

Advertisement

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రజిత, డాక్టర్ శ్రీరాములు , ఆరోగ్య మహిళా కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News