భారత్( India ) అంతటా ఎండలు మండిపోతున్నట్టు వాతావరణ శాఖ రోజుకొక కధనం వెల్లడిస్తోంది.అంతెందుకు మనకి కూడా తెలుసు కదా… బాగా ఎండలు మండిపోతున్నాయని.
ఏప్రిల్ నెల కావడంతో ఎండలు మరింత రెచ్చిపోతున్నాయి.ఉదయం 11 దాటక ముందే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు.
సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రతలో ఏమాత్రం మార్పు రావడం లేదు.ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయాలంటే వాయిదా వేసుకొనే పరిస్థితి వుంది.
ఈ క్రమంలో కారులో సాధారణ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్తో పాటు, వేడి వాతావరణ పరిస్థితులలో ఉపశమనం కలిగించే వెంటిలేటెడ్ సీట్లు వంటివి ఉండడం ఎంతో అవసరం.
అందుకే ఇక్కడ వెంటిలేటెడ్ సీట్లతో( ventilated seats ) కూడిన టాప్ కార్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.ముందుగా ఇక్కడ ‘టాటా నెక్సాన్ XZ+ LUX పెట్రోల్’ ( Tata Nexon XZ+ LUX Petrol )గురించి మాట్లాడుకోవాలి.ఈ వేరియంట్ వెంటిలేటెడ్ సీట్లు కలిగిన అత్యంత సుందరమైన కారు.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.60 లక్షలు మాత్రమే.తరువాత ఇక్కడ ‘కియా సోనెట్ HTX ప్లస్ టర్బో iMT’ గురించి మాట్లాడుకోవాలి.
ఈ వేరియంట్లో వెంటిలేటెడ్ సీట్లు కలవు.ఇక దీని ధర కేవలం రూ.12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే.‘మారుతీ సుజుకి XL6 ఆల్ఫా ప్లస్’ కూడా వీటి సరసన నిలుస్తుంది.ఆల్ఫా ప్లస్ వేరియంట్ ధర రూ.13.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా అందమైన వెంటిలేటెడ్ సీట్లు దీని సొంతం.
ఆ తరువాత ‘హ్యుందాయ్ వెర్నా SX(O) పెట్రోల్’ గురించి మాట్లాడుకొని తీరాలి.ఈ కారు సరికొత్త ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ డిజైన్ ను కలిగి వుంది.అదేవిధంగా ఇది కూడా వెంటిలేటెడ్ సీట్లతో వస్తుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.14.66 లక్షలుగా వుంది.అలాగే ‘స్కోడా స్లావియా స్టైల్’ మంచి ఆప్షన్.ఇది స్టైల్ ట్రిమ్ నుంచి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను అందిస్తుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.14.80 లక్షలుగా వుంది.ఈ కారు 1.0L TSI, 1.5L TSI అనే రెండు ఇంజన్ ఆప్షన్లతో ఇపుడు లభిస్తుంది.కాబట్టి ఇక్కడ వున్న లిస్టులో ఏ కారుని విక్రయించినా ఈ వేసవి మీకు చల్లడాన్ని ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.