రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ బెటాలియన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కమాండెంట్ కె.
సుబ్రమణ్యం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమాండెంట్ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ బి.ఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి , అతను ఒక రాజకీయవేత్త, న్యాయవాది, ఆర్థికవేత్త,సంఘ సంస్కర్త,అని అంబేద్కర్ అన్యాయంపై పోరాటంలో భాగంగా అంటరాని వారి పక్షాన నిలిచిన మహనీయుడని అన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను దేశానికి మొదటి న్యాయ శాఖ మంత్రి అయ్యారు.అన్నింటికి మించి భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తన జీవితాంతం, అతను భారతదేశంలోని వెనుకబడిన తరగతుల ప్రజల కోసం పనిచేశారని.దళితుల నాయకుడిగా ఉంటూ వారికి సమాన హక్కుల కోసం నిరంతరం పోరాడారు.
అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా, భారత రాజ్యాంగ రూపశిల్పి అనడంలో సందేహం లేదన్నారు.అంబేద్కర్ ప్రజ్ఞ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా చేసిందని, అంబేద్కర్ రాజ్యాంగపరమైన రక్షణలు, వివిధ పౌర హక్కుల కోసం హామీలను కలిగి ఉన్న ఒక వచనాన్ని కూడా రూపొందించారని,

భారతీయ సమాజానికి ఆయన చేసిన కృషికి 1990లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించిందని, భారతదేశంలోని యువత న్యాయవాదులందరికి ఆయన గొప్ప స్ఫూర్తి అని తెలిపారు.అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న జరుపుకుంటారు .ఇది బాబా సాహెబ్,అతని ఆశయాలకు అంకితం చేయబడిన రోజు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ యమ్.పార్థసారథి రెడ్డి,బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







