ఫిబ్రవరి 2 నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారం స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

గాంధీభవన్( Gandhi Bhavan ) లో పీఈసీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సీఎం రేవంత్, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.అప్పటినుండి లోక్ సభ ఎన్నికలకి సంబంధించి బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు.

ఫిబ్రవరి 2వ తారీఖున ఇంద్రవెల్లిలో బహిరంగ సభ జరగనుందని పేర్కొన్నారు.

Advertisement

ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలలో( Lok Sabha elections ) పోటీ చేయడానికి ఉత్సాహంతో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.అరవై రోజులలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని సూచించారు.గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందని పేర్కొన్నారు.

ఎన్నికలవేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళేందుకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు జరుగుతున్నాయి.పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇదే క్రమంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు