పోలీసుల దిగ్బంధంలో సీఎం జగన్ ఇల్లు..!!

తాడేపల్లి లో ఏపీ సీఎం వైయస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఆ చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కారణం చూస్తే టీడీపీ పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారం తెలుసుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు.>దీంతో తాడేపల్లి ప్రాంతం వైపు వెళ్ళే రహదారులన్నీ మూసివేశారు.

అన్ని చోట్ల భారీ భద్రత బలగాలు మోహరించి ఏక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది.ఇదే తరుణంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ అనుమానం వస్తే ఎవరిని వదిలి పెట్టడం లేదు.

ఈ పరిణామంతో తాడేపల్లి ప్రాంతం వైపు వెళ్లే ఎంట్రెన్స్ వద్ద హడావుడి నెలకొంది.ఇటీవల తిరుపతి వేదికగా చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నీ అరెస్టు చేయటం అదేవిధంగా అచ్చెన్నాయుడు ని అరెస్టు చేయటం వంటి  చర్యలను ఖండిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు