CM Jagan : కుప్పం పై కన్నేసిన జగన్ .. 26 న ఏం చేయబోతున్నారంటే ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను గెలుచుకుంటామనే ధీమాగా చెబుతున్నారు.

వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

సభలు , సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు,  పార్టీ నాయకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.ఒకవైపు ఈ సభలు , సమావేశాలతో పాటు ,ఎన్నికల వ్యూహాలపై  పూర్తిగా ఫోకస్ చేశారు.

ముఖ్యంగా టిడిపి , జనసేన కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాలే లక్ష్యం గా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం( Kuppam Assembly constituency ) పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు.అక్కడ చంద్రబాబును ఓడించగలిగితే రాజకీయంగా తమకు మరింతగా గ్రాఫ్ పెరుగుతుందని భావిస్తున్నారు .

Cm Jagan Will Visit Kuppam Constituency On 26th Of This Month
Advertisement
Cm Jagan Will Visit Kuppam Constituency On 26th Of This Month-CM Jagan : కు

 నియోజకవర్గంలో చంద్రబాబు ఓటమే ధ్యేయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy )కి అక్కడ బాధ్యతలను అప్పగించారు.ఎంఎల్సీ భరత్ ను  అభ్యర్థిగా ప్రకటించారు.ఈ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఏ విషయంలోనూ ప్రజలను సానుకూలత లభించకుండా పక్క ప్లాన్ ను జగన్ సిద్ధం చేశారు .దీనిలో భాగంగానే ఈనెల 26వ తేదీన జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు .అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి జగన్ అందించనున్నారు.కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చిన ఘనత వైసిపిదేనని చెప్పబోతున్నారు.

కుప్పంలో జరిగే సభలో జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు .ఇక తర్వాత ఈ నియోజకవర్గంలోని కీలక నాయకులతో జగన్ సమావేశం కానున్నారు.అనంతరం గుండి శెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.

Cm Jagan Will Visit Kuppam Constituency On 26th Of This Month

ఆ తర్వాత స్థానిక నాయకులతో సమావేశం అవుతారు.వైసీపీ గెలుపు కుప్పం తోనే ప్రారంభం కావాలని ఇప్పటికే జగన్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు.ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గం పైన , అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న భీమవరం నియోజకవర్గం పైన జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి ఓటమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు